బరువు తగ్గించే.. మూంగ్‌దాల్‌ చీలా!

అధిక బరువును తగ్గించుకోవడం కోసం అమ్మాయిలు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు కదా! అయితే, ఈసారి మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మూంగ్‌దాల్‌ చీలానూ చేర్చుకుని చూడండి. బరువు ఇట్టే తగ్గుతారు. ఇదేంటో కొత్తరకం వంటకం అనుకుంటున్నారా? అదేనండీ సింపుల్‌గా చెప్పాలంటే పెసరట్టు.

Updated : 21 May 2024 14:24 IST

ధిక బరువును తగ్గించుకోవడం కోసం అమ్మాయిలు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు కదా! అయితే, ఈసారి మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మూంగ్‌దాల్‌ చీలానూ చేర్చుకుని చూడండి. బరువు ఇట్టే తగ్గుతారు. ఇదేంటో కొత్తరకం వంటకం అనుకుంటున్నారా? అదేనండీ సింపుల్‌గా చెప్పాలంటే పెసరట్టు. అందుకోసం పెసరపప్పును నానబెట్టి అందులో మిరపకాయ, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, పసుపు, కొత్తిమీర, అన్నింటినీ వేసి మిక్సీ పట్టండి. దాన్లో కొంచెం నీళ్లను కలిపి అట్టులా వేసుకుంటే సరి. ఇందులోని ప్రొటీన్‌ మెటబాలిజాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆకలినీ అదుపులో ఉంచుతుంది. దీనిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కావడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయులూ అదుపులో ఉంటాయి. పెసర్లలోని ఫైబర్‌ పొట్టనిండిన భావనను కలిగించి ఎక్కువ ఆహారం తీసుకోకుండానూ సాయపడుతుంది. తద్వారా బరువు వేగంగా తగ్గుతాం! మరి మీకూ కావాలా? ఈ మూంగ్‌దాల్‌ చీలా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్