సన్‌స్క్రీన్‌... ఉచితంగా!

సాధారణంగా ప్రజల కోసం ప్రభుత్వాలు రకరకాల కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటాం కదా! అయితే, నెదర్లాండ్స్‌ ప్రభుత్వం చేపట్టిన ఓ సరికొత్త విధానం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated : 21 May 2024 13:49 IST

సాధారణంగా ప్రజల కోసం ప్రభుత్వాలు రకరకాల కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటాం కదా! అయితే, నెదర్లాండ్స్‌ ప్రభుత్వం చేపట్టిన ఓ సరికొత్త విధానం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. చర్మ క్యాన్సర్‌ బారిన పడేవారి సంఖ్య అక్కడ పెరుగుతుండడంతో స్కూళ్లు, కాలేజీలు, పార్కులు, స్పోర్ట్స్‌ ప్రదేశాల్లో ఉచిత ‘సన్‌స్క్రీన్‌ వెండింగ్‌ మెషీన్ల’ను అక్కడి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఏ ఇబ్బందీ లేకుండా ఈ వేసవి నెలల్లో యూవీ కిరణాల బారి నుంచి ప్రజలందరూ చర్మాన్ని రక్షించుకునేందుకు అక్కడి అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రజల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్