బద్ధకాన్ని తగ్గించే అశ్వ సంచలనాసన..!

అశ్వం అంటే గుర్రం. సంచలం అంటే కదలడం. ఈ ఆసనం వేయడం వల్ల తొడల నుంచి ఛాతీ భాగం వరకు శరీరం దృఢత్వాన్ని సంతరించుకుంటుంది. మెదడూ చురుగ్గా మారుతుంది. ఇందుకోసం.. నిటారుగా నిలబడి శరీరాన్ని ముందుకు వంచాలి.

Published : 25 May 2024 01:46 IST

అశ్వం అంటే గుర్రం. సంచలం అంటే కదలడం. ఈ ఆసనం వేయడం వల్ల తొడల నుంచి ఛాతీ భాగం వరకు శరీరం దృఢత్వాన్ని సంతరించుకుంటుంది. మెదడూ చురుగ్గా మారుతుంది. ఇందుకోసం.. నిటారుగా నిలబడి శరీరాన్ని ముందుకు వంచాలి. రెండు చేతులను పాదాలకు ఇరువైపులా ఆనిస్తూ.. కుడికాలిని వీలైనంత వెనకకు చాపి, నేలపై ఆనించాలి. ఎడమమోకాలిని మాత్రం ఫొటోలో చూపిన విధంగా చేతులకు సమాంతరంగా ఉంచాలి. శరీర బరువు రెండు చేతులూ, కుడికాలిపై సమానంగా పడేలా చూసుకోవాలి. చివరిగా తలను కొంతపైకి ఎత్తి వెనకకు వాల్చి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, కంటిచూపును రెండు కనుబొమల మధ్య నిలిపి ఉంచాలి. ఈ భంగిమలో ఇరవై సెకన్లపాటు ఉండాలి. మకరాసనంలో కాసేపు విశ్రాంతి తీసుకుని, మరోవైపు ప్రయత్నించాలి. చివరిగా శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. బద్ధకం, అలసట, నీరసం వంటివి దూరం అవుతాయి. సయాటికా, నెలసరి సమస్యలు, ఉన్నవారికి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. వాతపు నొప్పులను దూరం చేస్తుంది. మోకాళ్ల సర్జరీలూ, మెడకు గాయాలైనవారు, ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

దీంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కాయగూరలను ఎక్కువ తీసుకోవాలి. చిలగడదుంప, డ్రైఫ్రూట్స్, నట్స్‌... వంట వాటిలో ఇవి ఎక్కువ ఉంటాయి. చల్లటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

శిరీష, యోగ గురు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్