నెయ్యి తింటే మంచిదేనట!

వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుంది? కానీ, ఇప్పుడంతా కెలొరీల లెక్కే. అందుకే, కాస్త ఘాటెక్కువగా ఉన్న కూరలో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా... వద్దనేస్తున్నాం.

Published : 10 Jun 2024 02:19 IST

వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుంది? కానీ, ఇప్పుడంతా కెలొరీల లెక్కే. అందుకే, కాస్త ఘాటెక్కువగా ఉన్న కూరలో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా... వద్దనేస్తున్నాం. కానీ, రోజూ రెండు చెంచాల ఆవునెయ్యి తింటే మేలంటున్నాయి పలు అధ్యయనాలు. ఎందుకో తెలుసుకుందామా!

తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే సరి.  తిన్నది త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాదు.. గ్యాస్‌ సంబంధిత సమస్యలనూ దరి చేరనివ్వదు.

  •  నెయ్యిలో పోషకాల మోతాదూ ఎక్కువేనట. ముఖ్యంగా కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్‌ ఎ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు, దీని నుంచి మనకి అందే మంచి కొవ్వులు అధికబరువునీ అదుపులో ఉంచుతాయట. అలానే విటమిన్‌ ‘ఇ’ కాలేయాన్ని కాపాడుతుంది. హర్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది.
  •  వ్యాధినిరోధక శక్తి తక్కువుండేవారు , నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు తప్పనిసరిగా రోజూ రెండు చుక్కలైనా నెయ్యివేసుకుని తినండి. ఇది అధిక రక్తస్రావాన్నీ, నొప్పులనీ నివారిస్తుంది. ఇందులో ఉండే బ్యూటెరిక్‌ ఆమ్లం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాల్షియం దంత, ఎముక సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఒంట్లోని మలినాలను పోగొడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్