చుండ్రు తగ్గించే కుంకుళ్లు!

జుట్టు రాలిపోతుందని ఒకరూ... ఎన్నిషాంపూలు వాడినా చుండ్రు తగ్గడం లేదని మరికొందరూ వాపోతుంటారు. ఇక, ముఖంపై మొటిమల సంగతి చెప్పనే అక్కర్లేదు.

Published : 10 Jun 2024 02:16 IST

జుట్టు రాలిపోతుందని ఒకరూ... ఎన్నిషాంపూలు వాడినా చుండ్రు తగ్గడం లేదని మరికొందరూ వాపోతుంటారు. ఇక, ముఖంపై మొటిమల సంగతి చెప్పనే అక్కర్లేదు. అయితే, వీటన్నింటికీ పరిష్కారం ఖరీదైన షాంపూలు, క్రీముల్లో కాదు..  మన పూర్వికులు వాడిన కుంకుడుకాయల్లో ఉందంటోంది ఆయుర్వేదం. మరి ఈ సారి వాటితోనే తలస్నానం చేసి చూడండి. ఫలితం మీకే కనిపిస్తుంది.

కుంకుడు కాయల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే, దీన్ని నేరుగా వాడే బదులు, కాసిని మందార ఆకుల్ని కలిపి తలస్నానం చేయండి. ఇలా కనీసం నాలుగైదు వారాలు చేస్తే సరి.

  •  కుంకుడుకాయలకు యాంటీ అలర్జీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ. అందుకే చర్మానికి క్లెన్సర్‌గానూ వాడొచ్చు. మొటిమలూ, వాటి తాలూకు మచ్చలూ దూరమవుతాయి. ఇందుకోసం కుంకుడు రసంలో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు. క్రమంగా మీ సమస్య దూరమవుతుంది.
  •  కాలుష్యం, ఇతరత్రా సమస్యలు... ఈ రోజుల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం. ఈ ఇబ్బందికి చెక్‌ చెప్పేందుకు కుంకుడు రసం చక్కటి పరిష్కారం. వాటిని రెండు మూడు గంటల ముందు నానబెట్టి రసం తీయాలి. దీనికి పావు కప్పు కలబంద గుజ్జు కలిపి తలకు రాయాలి. ఆపై ఐదు నిమిషాలాగి రుద్ది తలస్నానం చేస్తే మాడు నుంచి చివర్ల వరకూ పట్టిన మురికితో పాటు రసాయనాల తాలూకు ప్రభావమూ వదులుతుంది.
  •  చాలామంది ముఖంపై చూపిన శ్రద్ధ పాదాలపై చూపించరు. దీనివల్ల అవి కాంతివిహీనంగా కనిపిస్తాయి. గోళ్లు, మడమలు మురికిగా మారతాయి. వీటిని శుభ్రం చేయడానికి కుంకుడు రసంలో కాస్త గులాబీనీరు చేర్చి ఓ పదినిమిషాలు నానబెట్టండి. ఆపై కొబ్బరి పీచుని తీసుకుని మృదువుగా రుద్దేయండి. టాన్, డెడ్‌స్కిన్‌ వదిలిపోతుంది. పాదాలూ కోమలంగా మారతాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్