అక్కడంతా మహిళా అధికారులే

కేరళలో 14 మంది జిల్లా కలెక్టర్లలో 10మంది మహిళలేనంటూ ఈమధ్యే గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఉత్తర్‌ ప్రదేశ్‌ మరో రికార్డు నెలకొల్పింది. అక్కడ కాన్పూర్‌దేహత్‌ జిల్లాలో అత్యున్నతస్థాయి అధికారులంతా అతివలే. జిల్లా కలెక్టర్‌, చీఫ్‌ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌, చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌, ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌, పర్యాటక శాఖాధికారి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, తహసీల్దార్‌- ఇలా

Published : 18 Jul 2022 00:46 IST

కేరళలో 14 మంది జిల్లా కలెక్టర్లలో 10మంది మహిళలేనంటూ ఈమధ్యే గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఉత్తర్‌ ప్రదేశ్‌ మరో రికార్డు నెలకొల్పింది. అక్కడ కాన్పూర్‌దేహత్‌ జిల్లాలో అత్యున్నతస్థాయి అధికారులంతా అతివలే. జిల్లా కలెక్టర్‌, చీఫ్‌ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌, చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌, ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌, పర్యాటక శాఖాధికారి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, తహసీల్దార్‌- ఇలా 17 కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా సునీతి పగ్గాలు చేపట్టడంతో ఆ సంఖ్య 18కి చేరింది. ‘ఇందరు మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఇక్కడికొచ్చాకే అర్థమైంది. వీళ్లతో కలిసి పనిచేయడం నిజంగా ఆహ్లాదం కలిగించే విషయం. మా అందరి మధ్యా చక్కటి అనుబంధం ఉంది’ అంటూ హర్షం వ్యక్తంచేశారు సునీతి. ‘మేమంతా మహిళలం కనుక మా ఆలోచనాతీరు ఒకే రీతిలో ఉంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచించడం, అమలుచేయడం సులువవుతుంది’ అంటారు కలెక్టర్‌ నేహా జైన్‌. అంతేకాదు, నలుగురు శాసనసభ్యుల్లో ఇద్దరు (ప్రతిభా శుక్లా, నిర్మలా శంఖ్‌వర్‌) మహిళలు కావడం మరో ప్రత్యేకత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్