పాఠాలు చెప్పేందుకు.. 25కి.మీ. నడక!

ఆ టీచర్‌ స్కూల్‌కి వెళ్లకుండానే అయిదు దశాబ్దాలుగా పాఠాలు చెబుతున్నారు. అదెలా   సాధ్యమంటారా, ట్యూషన్లతో. కేరళలోని కాసర్‌గడ్‌, చెరవత్తూరుకు చెందిన కేవీ నారాయణి 1972లో పదో తరగతి

Published : 26 Sep 2022 00:23 IST

ఆ టీచర్‌ స్కూల్‌కి వెళ్లకుండానే అయిదు దశాబ్దాలుగా పాఠాలు చెబుతున్నారు. అదెలా   సాధ్యమంటారా, ట్యూషన్లతో. కేరళలోని కాసర్‌గడ్‌, చెరవత్తూరుకు చెందిన కేవీ నారాయణి 1972లో పదో తరగతి పూర్తిచేశారు. తర్వాత పైచదువులకు వెళ్లలేకపోయారు. కానీ చదువుపై మమకారంతో 16 ఏళ్లకే ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు. అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అందుకోసం రోజూ 25 కి.మీ. దూరం నడుస్తారామె. ‘ఉదయం నాలుగున్నరకి నిద్రలేస్తా. అయిదున్నరకు ఇంటినుంచి బయలుదేరి ఆరింటికల్లా ఒకింట్లో ఇద్దరు పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభిస్తా. గంటన్నర తర్వాత మరో ఇంటికి.. అక్కణ్నుంచి మరో ఇంటికి. ఈ ఇళ్ల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. అయినా వారికి చెప్పిన సమయానికి నడిచే చేరుకుంటా. రాత్రి ఏడింటికి తిరిగి మా ఇంటికి వస్తా’ అని చెబుతారు 65 ఏళ్ల నారాయణి టీచర్‌. ప్రాథమిక తరగతులకు అన్ని సబ్జెక్టులూ చెబుతారీవిడ. ఉన్నత తరగతులకు మలయాళం, ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం చెబుతారు. కొవిడ్‌ సమయంలోనూ ఇంటింటికీ వెళ్లి పాఠాలు చెప్పారు. ఆఫ్‌లైన్‌ పాఠాలతో ఉండే ప్రభావం ఆన్‌లైన్లో ఉండదంటారీమె. అనారోగ్యం కారణంగా భర్త ఇంటికే పరిమితం కావడంతో ఈమె ఆదాయంతోనే ఇల్లు గడుస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 100 మందికి విద్యాబుద్ధులు నేర్పిన నారాయణి టీచర్‌..  ఊపిరి ఉన్నంతవరకూ పాఠాలు చెప్పడమే తన ధ్యేయమంటున్నారు. సొంత గూడు ఏర్పాటుచేసుకోవడం తన జీవిత లక్ష్యమంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్