చుక్కలపై ప్రేమ.. చరిత్రలో నిలిపింది!

ఆకాశంలో మెరుస్తున్న చుక్కల్ని అందుకోవాలన్న తపన.. అంతరిక్ష రహస్యాలను ఛేదించేలా చేసింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి చేసిన పోరాటాలెన్నో! హరియాణలోని కర్నాల్‌ కల్పనా చావ్లాది. నలుగురు సంతానంలో చిన్నది. అమ్మాయిలు చదువుకోవడం అక్కడ అసాధారణం. తను పట్టుబట్టి స్కూల్లో చేరింది. నక్షత్రాలపై ఆసక్తి సైన్స్‌పై మక్కువను పెంచింది.

Updated : 08 Oct 2022 05:22 IST

కాశంలో మెరుస్తున్న చుక్కల్ని అందుకోవాలన్న తపన.. అంతరిక్ష రహస్యాలను ఛేదించేలా చేసింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి చేసిన పోరాటాలెన్నో! హరియాణలోని కర్నాల్‌ కల్పనా చావ్లాది. నలుగురు సంతానంలో చిన్నది. అమ్మాయిలు చదువుకోవడం అక్కడ అసాధారణం. తను పట్టుబట్టి స్కూల్లో చేరింది. నక్షత్రాలపై ఆసక్తి సైన్స్‌పై మక్కువను పెంచింది. నాన్నతోపాటు సరదాగా ఫ్లయింగ్‌ క్లబ్‌లకు వెళ్లేది. అలా ఆకాశయానంపై ఆసక్తి కలిగి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. ఆస్ట్రోనాట్‌ అవ్వడం తన కల. అదిక్కడ నెరవేరదనుకొని అమెరికా వెళ్లింది. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ చేసి, నాసా ఏమ్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో రిసెర్చర్‌గా చేరింది. కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌పై పనిచేసింది. అమెరికా పౌరసత్వం తీసుకొని ఆస్ట్రోనాట్‌ బృందంలో స్థానం సంపాదించింది. ఏడాది శిక్షణ తర్వాత 1996లో ఎస్‌టీఎస్‌-87 కొలంబియా ఏర్‌క్రాఫ్ట్‌లో మిషన్‌ స్పెషలిస్ట్‌గా అంతరిక్షంలో అడుగుపెట్టింది. 15రోజుల పర్యటనలో వివిధ పరిశోధనలు చేసి భూమ్మీదకు తిరిగొచ్చింది. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మూలాలున్న మహిళగా నిలిచింది. రెండో అవకాశం 2003లో వచ్చింది. ఈసారీ 15 రోజుల పర్యటనే! ఏడుగురు బృందంలో ఈమె ఒకరు. 80 అంశాలపై పరిశోధనలు చేసి తిరిగొస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి వ్యోమనౌక పేలిపోయింది. అలా 41 ఏళ్ల వయసులో నింగికేగింది. నేటి పరిశోధనలెన్నో సఫలమవడంలో తన పరిశోధనలు సాయపడుతుండటమే కాదు.. ఎంతోమంది అమ్మాయిల ఊహలకు రెక్కలు తొడిగేలా చేసింది. నాసాలో అడుగుపెట్టాక భారత యువతలో అంతరిక్షంపై ఆసక్తి కలిగించాన్న ఉద్దేశంతో తను చదివిన పాఠశాల నుంచి ఏటా ఇద్దరిని ఎంపిక చేసి నాసాలో పర్యటించేలా చేసేది. ఈమె పరిశోధన, సాధించాలన్న పట్టుదల ప్రతిదీ స్ఫూర్తిదాయకమే!

అక్టోబరు 4 - 10 అంతరిక్ష వారోత్సవం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్