అందరినీ మెప్పించలేం

నేను ఇంజినీరింగ్‌ చదవాలనుకున్నప్పుడు మా నాన్న ఏ మాత్రం ఒప్పుకోలేదు. నన్నెవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని హెచ్చరించారు. కానీ నా మొండి పట్టుదలతో ఊరుకున్నారు.

Published : 17 Oct 2022 00:28 IST

అనుభవ పాఠాలు

నేను ఇంజినీరింగ్‌ చదవాలనుకున్నప్పుడు మా నాన్న ఏ మాత్రం ఒప్పుకోలేదు. నన్నెవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని హెచ్చరించారు. కానీ నా మొండి పట్టుదలతో ఊరుకున్నారు. కాలేజీలో చేరాలని వెళ్తే అక్కడా అదే పరిస్థితి. అయినా సరే... నేను వెనక్కి తగ్గకపోవడంతో కొన్ని షరతులతో చేర్చుకున్నారు. ఆ కాలేజీలోని 600 మంది విద్యార్థుల్లో నేనొక్కదాన్నే ఆడపిల్లని కావడం, కనీసం అమ్మాయిలకో మరుగుదొడ్డి  లేకపోవడం కూడా ఇందుకు కారణాలే. జీవితమంటే సిలబస్‌ తెలియని, ప్రశ్నపత్రాలు సెట్‌ చేసుకోని పరీక్ష. కనీసం మోడల్‌ జవాబు పత్రాలు కూడా దొరకవు. దీన్ని దాటాలంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి. దూరదృష్టితో ఆలోచించగలగాలి. అప్పుడే జీవితంలో ఉన్నతంగా నిలబడగలం. అయితే, ఈ ప్రయాణంలో అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తే ఎవరినీ సంతృప్తి పరచలేం. అలా జీవితాన్ని గడపడం కూడా కష్టమే. వాస్తవికతను గమనించుకుంటూ ...లక్ష్యాలను పెట్టుకుంటేనే అనుకున్నవి చేయగలం.

- సుధామూర్తి,  ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌, రచయిత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్