కొత్తదారి అయితేనేం..

ఇంట్లో అందరూ విద్యా వేత్తలే. వ్యాపారం వైపు వచ్చిన తొలి వ్యక్తిని నేనే. అమెరికాలో పెద్ద ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేస్తానంటే అందరూ వద్దన్నవారే. ఫైనాన్స్‌ రంగం, అదీ డిజిటల్‌ మనీ అని చెప్పినప్పుడు నన్నో పిచ్చి దానిలా చూశారు.

Published : 20 Oct 2022 00:11 IST

అనుభవ పాఠాలు

ఇంట్లో అందరూ విద్యా వేత్తలే. వ్యాపారం వైపు వచ్చిన తొలి వ్యక్తిని నేనే. అమెరికాలో పెద్ద ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేస్తానంటే అందరూ వద్దన్నవారే. ఫైనాన్స్‌ రంగం, అదీ డిజిటల్‌ మనీ అని చెప్పినప్పుడు నన్నో పిచ్చి దానిలా చూశారు. అమ్మాయిల్లో ఈ రంగంలోకి ఎవరూ వెళ్లలేదంటూ నిరాశపరిచారు. పెట్టుబడుల గురించి మాట్లాడేప్పుడు ఎంతో మంది ‘మగవాళ్లు వస్తారనుకున్నాం. నీతో ఏం మాట్లాడతా’మనే వారు. ‘మీరు వాళ్లతోనే మాట్లాడతానంటే సరే. కానీ మీ ప్రశ్నలకు సమాధానం నేను మాత్రమే ఇవ్వగలను. అయినా ఫర్లేదా’ అని అడిగేదాన్ని. ఇలాంటి సందర్భాలెన్నో! కానీ నిరాశ పడలేదు. పురుషాధిక్య రంగంలో ఓ స్థానాన్ని ఏర్పరచుకోవాలన్న తపనతో పనిచేశా. ఒక్కరైనా డౌన్‌లోడ్‌ చేసుకుంటారా అన్న మా వాలెట్‌ను 12 కోట్ల మందికిపైగా ఉపయోగిస్తున్నారు. ఏదైనా నచ్చి, చేయగలను అనిపించిందా.. ధైర్యంగా ముందడుగు వేయండి. కనీసం ప్రయత్నించలేదే అన్న బాధైనా తప్పుతుంది. మీ కలలు నెరవేరడానికి మీరే కృషి చేయాలి. కొత్త దారిలో వెళ్లడానికి ఎప్పుడూ భయపడొద్దు.

- ఉపాసన టాకు, సీఓఓ, మొబీక్విక్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్