నీతో గడిపే సమయంలేదని క్యాన్సర్‌కి చెప్పాను..

నాలుగేళ్లకే నృత్యంలో శిక్షణ ప్రారంభించి, 11వ ఏట ఓ పోటీలో స్వర్ణపతకం సాధించా. అదే చెన్నై కళాక్షేత్ర అకాడమీలో చేరే అవకాశాన్నిచ్చింది. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరా.

Updated : 21 Oct 2022 06:29 IST

అనుభవ పాఠాలు

నాలుగేళ్లకే నృత్యంలో శిక్షణ ప్రారంభించి, 11వ ఏట ఓ పోటీలో స్వర్ణపతకం సాధించా. అదే చెన్నై కళాక్షేత్ర అకాడమీలో చేరే అవకాశాన్నిచ్చింది. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరా. భారతీయ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చినా నా అభిరుచిని, కెరియర్‌ను సమన్వయం చేయగలిగా. ఓసారి జాతీయ నృత్యోత్సవానికి సిద్ధమవుతుండగా, అనుకోని అనారోగ్యం. పరీక్షల్లో రొమ్ము క్యాన్సర్‌ అన్నారు. భయంతో ఒణికిపోయా. ప్రాణం గురించి కాదు, దానికన్నా ఎక్కువైన నృత్యానికి దూరమవుతానా అని. అందుకే పోరాడాలని నిశ్చయించుకున్నా. శస్త్రచికిత్స జరిగిన రెండు రోజులకే ఆసుపత్రి మంచంపై నుంచే ల్యాప్‌టాప్‌లో పనులు మొదలు పెట్టేశా. ఇంటికి వచ్చిన వెంటనే నా స్టూడియోకు వెళ్లి సాధన ప్రారంభించా. క్యాన్సర్‌ సోకింది శరీరంలో ఒక భాగానికి మాత్రమే. నా మనసు, ఆత్మ అన్నీ నృత్యం గురించే తపించేవి. అందుకే క్యాన్సర్‌తో ‘నీతో గడపడానికి నాకు సమయం లేదు. బయలుదేరు’ అని చెప్పగలిగా. ప్రతి కీమో చికిత్స తర్వాత 4 రోజులకే నృత్యం చేసేదాన్ని.

ఏ కష్టం ఎదురైనా మానసిక బలాన్ని చేజార నివ్వకూడదు. అనారోగ్యానికి లొంగకుండా పోరాడితే జయం మనదే. నచ్చిన పనులపైనే ఏకాగ్రత పెట్టాలి. సానుకూలంగా ఆలోచించాలి. అప్పుడే భయం పారిపోతుంది. క్యాన్సర్‌ బాధితుల కుటుంబాలకు చెప్పేదేంటంటే.. వారికిష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తే చాలు. వ్యాధిని తేలిగ్గా జయిస్తారు.

- డా.ఆనంద శంకర్‌ జయంత్‌,నాట్యకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్