వైకల్యాన్ని జయించి.. సౌర వెలుగులు పూయించి

మాది మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండల కేంద్రం.. కంది గ్రామం. మేం నలుగురు అక్కాచెల్లెళ్లం, ఒక తమ్ముడు. పోలియో వల్ల నా ఎడమ కాలు పనిచేయదు. దాంతో చేతులతోనే నడిచేదాన్ని. బడికి వెళ్లడానికి చాలా కష్టమయ్యేది. నాన్న ఎత్తుకొని తీసుకొచ్చి, తీసుకెళ్లేవారు. ఆ తర్వాత కర్రసాయంతో నడవడం మొదలుపెట్టాను.

Updated : 26 Oct 2022 08:55 IST

పోలియో ఆమె అడుగులని తడబడేలా చేసిందే కానీ.. ఆమె లక్ష్యాలు, ఆశయాలని చేరుకోకుండా ఆపలేకపోయింది. జుబేదా పట్టుదల ముందు వైకల్యమే తలవంచింది. ఆమె తనలాంటి వారికి అండగా నిలబడటం కోసం ఏం చేసిందో తెలుసుకోవాలను కుంటున్నారా?

 

మాది మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండల కేంద్రం.. కంది గ్రామం. మేం నలుగురు అక్కాచెల్లెళ్లం, ఒక తమ్ముడు. పోలియో వల్ల నా ఎడమ కాలు పనిచేయదు. దాంతో చేతులతోనే నడిచేదాన్ని. బడికి వెళ్లడానికి చాలా కష్టమయ్యేది. నాన్న ఎత్తుకొని తీసుకొచ్చి, తీసుకెళ్లేవారు. ఆ తర్వాత కర్రసాయంతో నడవడం మొదలుపెట్టాను. అలా కష్టపడి తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నా. ఒకసారి తెలిసిన వాళ్లు ‘నీలాంటి వాళ్లకి ప్రభుత్వం టెలిఫోన్‌ బూత్‌లు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంద’ని అన్నారు. దాంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం చుట్టూ తిరిగేదాన్ని. ఎనిమిది నెలల పాటు తిరిగినా పని కాకపోవడంతో నిరాశ పడ్డాను. నా కష్టం చూసి ఇంట్లోవాళ్లు ‘ఇదంతా అవసరమా’ అనేవారు. ఓ దశలో చనిపోవాలనిపించింది. సరిగ్గా అదే సమయంలో నాలో ఆశలు నింపుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక ఆర్జీ సరైన వాళ్లకి చేరుకోడానికి ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయాలు తెలిశాయి.


సౌర ఉత్పత్తులతో...

గూడు ఒక్కటే సరిపోదు కదా.. ఉపాధి కూడా దొరికినప్పుడే జీవితం సజావుగా సాగుతుంది. ఇందుకోసం వైకల్యం ఉన్నవారికి ఉపాధినందించే విషయాల్లో శిక్షణ ఇప్పించాలనుకున్నా. అప్పటి పాలనాధికారి రోనాల్డ్‌రోస్‌ను కలిసి విజ్ఞప్తి చేశాను. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఎన్‌ఐఆర్‌డీ శిక్షణ కేంద్రం అధికారులతో ఆయన మాట్లాడారు. సోలార్‌ మినీ ఎల్‌ఈడీ దీపాల తయారీలో శిక్షణ ఇప్పించారు. చర్లపల్లికి చెందిన త్రైవ్‌ మినీ సోలార్‌ ప్రైవేటు పరిశ్రమలో మేమంతా శిక్షణ పూర్తి చేసుకున్నాం. శిక్షణ అనంతరం సంగారెడ్డిలోని పాత డీఆర్‌డీఏ కార్యాలయం ఆవరణలో దివ్యాంగ్‌ సోలార్‌ సొసైటీని ఏర్పాటు చేశాం. దీని ఆధ్వర్యంలో సోలార్‌ లైట్లను ఉత్పత్తి చేసి, విక్రయిస్తున్నాం. సోలార్‌ దీపాల తయారీతోపాటు మరింతమందికి ఉపాధి చూపాలన్న లక్ష్యంతో ఏకరూప దుస్తుల తయారీపై దృష్టి సారించా. ప్రస్తుతం అధికారుల అనుమతితో రామచంద్రాపురం మండలంలోని 35 ప్రభుత్వ పాఠశాలలకు ఏక రూప   దుస్తులు తయారు చేసి అందిస్తున్నా.


నాలాంటి వాళ్లకోసం...

కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగానే మా టెలిఫోన్‌ బూత్‌ ఉండేది. నాలాగే ఎంతోమంది కలెక్టరేట్‌లో ఆర్జీలు పెట్టుకోవడం, చెప్పులు అరిగేలా తిరగడం గమనించాను. నాకు తెలిసినంతలో అలాంటి వారికి సాయపడాలని అనుకున్నాను. టెలిఫోన్‌ బూత్‌ బాధ్యతలు నాన్నకు అప్పగించా. వికలాంగులకు అండగా ఉండే యాక్షన్‌ ఇండియా అనే ఎన్జీవోతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. వికలాంగులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశా. చైతన్య సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్లు టెలిఫోన్‌ బూత్‌లు పెట్టుకోడానికి సహకరించాం. వాళ్లకి ఓ నీడ కల్పించడం కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డా. చివరికి మా ఊర్లోనే 126 మందికి 100 గజాల చొప్పున ఇళ్లస్థలాలను కేటాయించారు. 

 - కమ్మరి శివకుమార్‌, సంగారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్