రుణం కోసం కాళ్లరిగేలా తిరిగా..

నా పెళ్లికి దుస్తుల డిజైన్‌ కోసం చాలాచోట్ల తిరిగా. చివరకు ఒక చోట కుట్టించడానికి ఇచ్చాను. తీరా వాటిని ధరించేటప్పుడు కనిపించిన అవకతవకలు చాలా బాధ కలిగించాయి.

Published : 30 Oct 2022 00:34 IST

అనుభవపాఠాలు

నా పెళ్లికి దుస్తుల డిజైన్‌ కోసం చాలాచోట్ల తిరిగా. చివరకు ఒక చోట కుట్టించడానికి ఇచ్చాను. తీరా వాటిని ధరించేటప్పుడు కనిపించిన అవకతవకలు చాలా బాధ కలిగించాయి. చాలా మంది ఇదే సమస్యనెదుర్కొంటూ ఉంటారు కదా అనిపించింది. ఎక్కడ చూసినా చీరలు, రెడీమేడ్‌ బ్లవుజులుండేవి. ప్రత్యేకంగా బ్లవుజులంటూ ఎక్కడా కనిపించలేదు. ఈ వెలితిని నేనే భర్తీ చేయాలనుకున్నా. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదివిన నేను, బ్లవుజులు, బ్రైడల్‌ వేర్‌ తయారీ ప్రారంభించా. వ్యాపారంలోకి అడుగు పెట్టాలంటే చాలా అధ్యయనం చేయాలి. అన్నీ అయ్యాక మొదలు పెడదామనుకునే సరికి పెట్టుబడి లేదు. దాంతో రుణం కోసం తిరగని బ్యాంకు లేదు. పదేళ్లక్రితం ప్రభుత్వ పథకాలు ఇప్పుడున్నంతగా లేవు. అయితే నిరాశ పడలేదు. పట్టుదలగా తిరిగి, అతికష్టమ్మీద ఓ రూ.లక్ష రుణాన్ని సాధించా. ‘జస్ట్‌ బ్లవుజెస్‌’ ప్రారంభించా. నిర్విరామ కృషితో ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ వచ్చా. ఇప్పుడు అమెరికా, సింగపూర్‌, లండన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి ఆర్డర్లు వచ్చే స్థాయికి సంస్థని తీసుకెళ్లగలిగా. ఇద్దరితో మొదలైన సంస్థ వందల మందికి ఉపాధిని అందిస్తోంది. మహిళా సాధికారత కల్పించే దిశగా కృషి చేస్తున్నా. స్థానికంగానే కాకుండా ఇథియోపియా, మంగోలియా, పాలస్తీనా, పపువా న్యూగునియా, పెరూ వంటి దేశాల మహిళా హస్త కళాకారులకూ ఉపాధినిస్తున్నా. వారి కళలకు ప్రాణం పోయడంతోపాటు, ప్రపంచానికి దాన్ని పరిచయమూ చేస్తున్నా.

- వర్షా మహేంద్ర, వ్యవస్థాపకురాలు, ‘జస్ట్‌ బ్లవుజెస్‌’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్