Rajani Pandit: హంతకుడి కోసం పనిమనిషిగా చేరా..

పాఠశాల స్థాయి నుంచీ డిటెక్టివ్‌ పని అంటే ఇష్టం. కాలేజీలో సహవిద్యార్థినికి సాయం చేయడానికి మొదటిసారిగా డిటెక్టివ్‌నయ్యా. నిజాన్ని కనిపెట్టగలగడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

Updated : 07 Nov 2022 11:56 IST

పాఠశాల స్థాయి నుంచీ డిటెక్టివ్‌ పని అంటే ఇష్టం. కాలేజీలో సహవిద్యార్థినికి సాయం చేయడానికి మొదటిసారిగా డిటెక్టివ్‌నయ్యా. నిజాన్ని కనిపెట్టగలగడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. చీకట్లో ఉండిపోయే వాస్తవాలను వెలుగులోకి తెచ్చి సమాజానికి సాయం చేయాలనుకున్నా. అందుకే దీన్నే కెరియర్‌గా ఎంచుకొన్నా. కేసుల పరిశోధన కోసం వికలాంగురాలిగా, గర్భిణిగా, వీధివ్యాపారిగా చాలా మారువేషాలు వేశాను. అవతలివారికి అనుమానం రాకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పొరపాటు జరిగితే ప్రాణాలే పోతాయి అయినా సరే.. నిజాన్ని కనిపెట్టే వరకు నిద్రపోయేదాన్ని కాదు. ఓసారి హంతకుడితో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న ఓ మహిళవద్ద పనిమనిషిగా చేరా. నిజం కనిపెట్టడానికి ఆరునెలలు ఓపికగా ఎదురుచూశా. నేననుకున్నట్లుగానే అతడు ఒకరోజు ఆ ఇంటికొచ్చాడు. అక్కడి నుంచి బయటకెళ్లి సమాచారం అందించాలి. వెంటనే కత్తితో నా కాలిపై గాయం చేసుకొన్నా. రక్తమోడుతున్న కాలిని చూపించి మందుల కోసమంటూ బయటకొచ్చా. పోలీసులకు సమాచారం అందించి ఆ హంతకుడిని పట్టించగలిగా. నేనే కాదు...ఆసక్తి, ధైర్యం ఉంటే చాలు. ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చు.

- రజనీపండిట్‌, మొదటి మహిళా డిటెక్టివ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్