సౌర గిడ్డంగిలో దాచేస్తున్నారు!

ఎండనక, వాననక శ్రమించి కష్టపడి పండించిన పంటకి సరైన ధర రాకపోతే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి రైతుది.

Updated : 09 Nov 2022 04:29 IST

ఎండనక, వాననక శ్రమించి కష్టపడి పండించిన పంటకి సరైన ధర రాకపోతే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి రైతుది. అందుకే చాలామంది పెట్టుబడి మాట అటుంచి పావలాకి, అర్థకి పంటని అమ్మలేక.. పొలాల్లో పశువులకి ఆహారంగా వదిలేయడమో, పారబొయ్యడమో చేస్తుంటారు. రైతు కష్టం ఇలా వృథా అవుతుంటే మనసు చివుక్కుమంటుంది కదా! మహిళా రైతులు నడిపిస్తున్న ఈ కోల్డ్‌ స్టోరేజీ గురించి తెలిస్తే రైతు సమస్యలకి ఓ చక్కని పరిష్కారం దొరికింది అనిపిస్తుంది. ఒడిశాలోని కియోంజర్‌ జిల్లాలోని చాంపువా ప్రాంత మహిళలు సౌరవిద్యుత్‌తో పనిచేసే శీతల గిడ్డంగిని నిర్వహిస్తూ లాభాల బాట పడుతున్నారు. మహేశ్వరం గ్రామ స్వయం సహాయక బృందాల మహిళలు ఐదు మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగిని సౌర విద్యుత్‌ సాయంతో నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఏర్పాటు చేసిన ఈ గిడ్డంగికి రూ.15లక్షల వ్యవసాయశాఖ రాయితీ కూడా ఇచ్చింది. దాని బాధ్యత పూర్తిగా మహిళలదే. వారి పంటనే కాక ఊళ్లో రైతుల పంటను కూడా ఇందులో కొంత రుసుము చెల్లించి దాచుకోవచ్చు. సరైన ధర వచ్చేంతవరకూ అట్టిపెట్టుకోవచ్చు. ఈ గిడ్డంగి వచ్చాక కాయగూరలు కుళ్లిపోవడం, పారబోయడం వంటి సమస్యలు ఎదుర్కోలేదని, పైగా మాకు కొంత అదనపు ఆదాయమూ వస్తోందని ఇక్కడి మహిళలు సంతోషపడిపోతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్