సైనికాధికారి అయితేనే.. అమ్మ ఇంటికి రమ్మంది

మేం ముగ్గురు ఆడపిల్లలం. నా అయిదోఏట నాన్న చనిపోతే, అమ్మే పెంచింది. తోటివాళ్లందరూ ట్యూషన్‌కెళితే, నేను పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని చదువుకొనే దాన్ని.

Published : 14 Nov 2022 00:18 IST

మేం ముగ్గురు ఆడపిల్లలం. నా అయిదోఏట నాన్న చనిపోతే, అమ్మే పెంచింది. తోటివాళ్లందరూ ట్యూషన్‌కెళితే, నేను పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని చదువుకొనే దాన్ని. పండగలు, శుభకార్యాల్లో అందరూ మంచి దుస్తులు ధరించినప్పుడు, నా దృష్టి మాత్రం ఆకుపచ్చని మిలటరీ దుస్తులపైనే ఉండేది. స్కూల్‌కెళ్లేటప్పుడు దారిలో సైనికుల శిక్షణను చూసేదాన్ని. అదే దేశరక్షణలో భాగస్వామిని కావాలనే లక్ష్యాన్నిచ్చింది. ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు ఇంటర్వ్యూకి వెళితే ఉద్యోగం వచ్చాక శిక్షణకు ఎంపికైనట్లు లేఖ వచ్చింది. సైన్యంలో చేరితే ఎండలో నల్లగా అవుతావు, గాయాలవుతాయి, పెళ్లి కుదరదంటూ బంధువులు భయపెట్టారు. అమ్మ మాత్రం ‘సైనికాధికారి అయితేనే ఇంటికి తిరిగి రా, లేకుంటే వద్దు’ అని చెప్పింది. శిక్షణలో నైపుణ్యాలెన్నో నేర్చుకొన్నా. మా కుటుంబాల్లో లేని లింగ సమానత్వాన్ని అక్కడ చూశా. మహిళనైనా... పై అధికారులు నాకు ప్రమాదకరమైన ఆ ప్రాంతాల్లోనూ.. బాధ్యతలివ్వడం వల్లే నన్ను నేను నిరూపించుకోగలిగా. అమ్మాయిలకు నేను చెప్పేదేంటంటే.. ‘లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో సాధించడానికి కృషి చేయండి. ఏ రంగంలోనైనా అడుగు పెట్టండి. ప్రతి ఒక్కరిలోనూ ఉండే సైనికుడు అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి తీసుకోడు. మన జీవితాశయమేంటో మనమే నిశ్చయించుకొని నచ్చినట్లుగా జీవిస్తేనే ఛాలెంజింగ్‌గా ఉంటుంది’.

- మేజర్‌ ఆర్చీ ఆచార్య, ఇండియన్‌ ఆర్మీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్