అందుకు భయపడను!

నాన్న మెకానికల్‌ ఇంజినీర్‌. అమ్మా బాగా చదువుకొంది. వాళ్లను చూసే ఉన్నత చదువులపై ఆసక్తి కలిగింది. 80ల్లో ఐఐటీలో చేరా.

Updated : 18 Nov 2022 04:55 IST

 అనుభవ పాఠం

నాన్న మెకానికల్‌ ఇంజినీర్‌. అమ్మా బాగా చదువుకొంది. వాళ్లను చూసే ఉన్నత చదువులపై ఆసక్తి కలిగింది. 80ల్లో ఐఐటీలో చేరా. మా క్లాసులో దాదాపు వంద మంది ఉంటే ఆడపిల్ల నేనొక్కదాన్నే! ప్రత్యేక వాష్‌రూమ్‌ ఉండేది కాదు. ప్రాజెక్టులు కలిసి చేయడానికీ అబ్బాయిలు ఇష్టపడే వారు కాదు. ఓ నెల చూశాక వెళ్లిపోదామనుకున్నా. నా సీనియర్‌ ‘వదిలేస్తే.. ఓడేది నువ్వే’ అంది. అప్పట్నుంచీ నిరూపించుకోవాలన్నది ఒకటే ధ్యాస.. మా తరగతిలో నేనే ఫస్ట్‌. అమెరికాలో చదువయ్యాక.. ఏరోస్పేస్‌ సంస్థలో ఉద్యోగమొచ్చింది. అక్కడ మొదటి మహిళా ఉద్యోగిని. వేరే దేశం నుంచి ఇక్కడ చేరిన తొలి వ్యక్తిని కూడా. ‘మ్యాచ్‌ గ్రూప్‌’లో కొచ్చి, సీఈఓ స్థాయికి ఎదిగా. మహిళగా ఈ స్థాయికి ఎలా చేరుకోగలిగారని అడుగుతుంటారు. కొత్తదారిలో నడవడానికి నాకు భయం లేదు. ఎదగాలంటే అన్నీ తెలియాలన్నదీ నమ్మను. సమస్యను పరిష్కరించడం తెలియాలి.. చుట్టూ ఉన్న వారిని గౌరవించడం, వాళ్లతో కలిసిపోయే లక్షణాలుంటే చాలు. ఏ దారిలోనైనా సులువుగా ప్రయాణించొచ్చు.

- షార్‌ దూబే, మాజీ సీఈఓ, మ్యాచ్‌ గ్రూప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్