నాయకత్వ లక్షణాలు ఒకరిచ్చేవి కావు...

కమల అంటే కలువ అని అర్థం. భారతీయ సంస్కృతిలో దానికి ప్రత్యేక స్థానం ఉంది. పైకి ఆ పూవు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ దాని వేళ్లు మాత్రం కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి.

Published : 28 Nov 2022 00:05 IST

కమల అంటే కలువ అని అర్థం. భారతీయ సంస్కృతిలో దానికి ప్రత్యేక స్థానం ఉంది. పైకి ఆ పూవు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ దాని వేళ్లు మాత్రం కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి. నా ఆలోచనలూ, ఆచరణా అంతే దృఢంగా ఉంటాయి. ఇందుకు మా అమ్మకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇద్దరు నల్లజాతి కూతుళ్లను పెంచుతున్నానని నా తల్లికి బాగా తెలుసు. అందుకే మమ్మల్ని ఆత్మవిశ్వాసం గల, సగర్వమైన నల్లజాతి మహిళలుగా పెంచాలని తను నిర్ణయించుకుంది. అందుకే ఆమె ఎప్పుడూ చెప్పేది. ‘కమలా చాలా పనులు చేయడంలో నువ్వు మొదటిదానివి కావొచ్చు కానీ...నువ్వు మాత్రమే చివరి దానివి కాదు. అందుకే నీ హక్కుల కోసమే కాదు...తోటివారికి సాయం చేసే విషయంలోనూ గొంతెత్తి మాట్లాడటం అలవాటు చేసుకో అనేది. ఆ మాటలే అన్యాయాన్ని ప్రశ్నించడం నాకు అలవాటు చేశాయి. ఈ రోజు నన్నీ స్థాయికి చేర్చాయి. నిజానికి నాయకత్వ లక్షణాలు ఒకరు ఇస్తే వచ్చేవి కాదు...వాటిని మనమే అందిపుచ్చుకోవాలి. మన సామర్థ్యమే మనకి గుర్తింపు తేవాలి. ఇవన్నీ జరగాలంటే ముందు ప్రతి మహిళా...తన హక్కుని తాను తెలుసుకోగలగాలి.

- కమలా హ్యారిస్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్