అభద్రతతో అడుగులేయొద్దు...!

‘మనం ఏం చేస్తున్నాం... ఏం చేయాలి’...అన్న స్పష్టత ఉంటే పెట్టుకున్న లక్ష్యం ఎంత కష్టమైనా సాధించొచ్చు.

Updated : 29 Nov 2022 05:26 IST

అనుభవపాఠం

‘మనం ఏం చేస్తున్నాం... ఏం చేయాలి’...అన్న స్పష్టత ఉంటే పెట్టుకున్న లక్ష్యం ఎంత కష్టమైనా సాధించొచ్చు. 22 ఏళ్లకు కంపెనీలో డైరెక్టరుగా అడుగుపెట్టా. 2006లో సీఈవోగా బాధ్యతలు తీసుకున్నా. ఈ మధ్యకాలంలో చేసిన ప్రయోగాల కంటే నేర్చుకున్న పాఠాలే ఎక్కువ. నాన్న చేతి నుంచి నేను సంస్థ పగ్గాలు అందుకునే సమయానికి సంస్థ 600కోట్ల టర్నోవర్‌ని సాధించింది.  మూలాల్ని మరిచిపోకుండానే, మారుతోన్న అవసరాలను గుర్తించాలనేది నా తత్వం. ఆ దిశగానే అడుగులేశా. అప్పటికే మార్కెట్లో దూసుకుపోతోన్న ఇతర శీతల పానీయాల బ్రాండ్ల పోటీని తట్టుకోవడం అంత సులువేం కాదు. కానీ నేనెప్పుడూ రాజీ పడలేదు.  ఉత్పత్తి ఎలాంటిదైనా సరే.. వినియోగదారులు సంతృప్తి చెందితేనే సంస్థ నిలదొక్కుకుంటుందన్న సూత్రాన్ని నమ్మి ముందడుగు వేశా. దాని ఫలితమే ఆపీ, ఫ్రూటీ, ఫిజ్‌, బెయిలే, ఫ్రియో, ఢిషుమ్‌ వంటివన్నీ. పదివేల కోట్ల టర్నోవర్‌కి చేరువలో ఉన్నాం ఇప్పుడు. నిజానికి వ్యాపార రంగంలో రాణించడం అంత సులువేం కాదు.... పురుషాధిక్య ప్రపంచంలో నిలబడాలంటే మగవారికంటే రెండింతలు ఎక్కువే కష్టపడాలి. అయినా సరే, మహిళలెప్పుడూ తమ శక్తిని తక్కువ అంచనా వేసుకోకూడదు. నేనెప్పుడూ అలా చేయను. అందుకే అభద్రతతో ఎప్పుడూ ఏ పనీ చేయలేదు.

-షౌనా చౌహాన్‌, పార్లే ఆగ్రో సంస్థ సీఈవో

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్