పిల్లల కోసం స్టీరింగ్‌ పట్టుకొన్నా..

ఒక్కోసారి మన నిర్ణయాలు జీవితాన్నే మార్చేస్తాయి. నేను పుట్టింది ఉత్తర్‌ప్రదేశ్‌లో. కామర్స్‌, లా చదివా.

Updated : 15 Dec 2022 02:56 IST

అనుభవపాఠం

క్కోసారి మన నిర్ణయాలు జీవితాన్నే మార్చేస్తాయి. నేను పుట్టింది ఉత్తర్‌ప్రదేశ్‌లో. కామర్స్‌, లా చదివా. మావారిది మధ్యప్రదేశ్‌, భోపాల్‌. 2001లో పెళ్లైంది. ఆయన డ్రైవరనే విషయం పెళ్లయ్యాక తెలిసింది. వాళ్లకొక చిన్న రవాణా సంస్థ ఉండేది. ఇద్దరు పిల్లలు పుట్టాక, ఆయనో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సంస్థ, ఇంటి బాధ్యతలు నేనే తీసుకొన్నా. డ్రైవరు సమయానికి రవాణా చేయకపోవడంతో నష్టాలు  మొదలయ్యాయి. ఇక లాభం లేదని, పిల్లలను చదివించడానికి స్టీరింగ్‌ పట్టుకోవాలనుకున్నా. శిక్షణ తీసుకొని నడపడం మొదలుపెట్టా. అప్పటికి మన దేశంలో ట్రక్కు నడిపే మహిళలెవరూ లేరు. నాకిది పెద్ద ఛాలెంజ్‌. మొదట్లో విమర్శలు, అవమానాలు ఎదురైనా ఓపిగ్గా నిరూపించుకొన్నా. హైవేల్లో ట్రక్కు నడపడం చాలా కష్టమైన విషయం. రాష్ట్రేతర ప్రాంతాలకు వెళ్లాలంటే రాత్రుళ్లూ  ప్రయాణించాలి. అన్నీ తెలిసీ అడుగుపెట్టా. డ్రైవింగ్‌ సీట్లో నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయే వారు. కొందరు ఆపి మరీ అభినందించే వారు. మొదట్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే తిరిగాను. తర్వాత దేశ వ్యాప్తంగా గూడ్స్‌ రవాణా చేయగలిగే స్థాయికి చేరుకున్నా. మగ వాళ్లు మాత్రమే భారీ వాహనాలను నడపగలరనే ఆలోచనను మార్చి చూపించా. మహిళ ఏదైనా సాధించగలదని నిరూపించినందుకు గర్వంగా ఉంటుంది. నాలా మరి కొందరు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి స్ఫూర్తినయ్యా. ఫలానా పని చేయగలమని అనిపిస్తే ధైర్యంగా అడుగుపెట్టండి... విజయం మనదవుతుంది.

- యోగితా రఘువంశీ, దేశంలో తొలిమహిళా ట్రక్కు డ్రైవరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్