Holi: అక్కడ మగవాళ్లు ఆడితే దెబ్బలే!

ఏంటీ ఆడవాళ్లు మాత్రమే హోలీ ఆడాలా... మగవాళ్లు ఆడకూడదా! ఆడితే ఏం చేస్తారు? పొరపాటున కూడా ఈ ఊహ రానీయకండి. వాళ్ల మాటకాదని మగవాళ్లు హోలీలో పాల్గొన్నారనుకోండి లాఠీ ఛార్జీయే...

Updated : 07 Mar 2023 11:51 IST

ఏంటీ ఆడవాళ్లు మాత్రమే హోలీ ఆడాలా... మగవాళ్లు ఆడకూడదా! ఆడితే ఏం చేస్తారు? పొరపాటున కూడా ఈ ఊహ రానీయకండి. వాళ్ల మాటకాదని మగవాళ్లు హోలీలో పాల్గొన్నారనుకోండి లాఠీ ఛార్జీయే...

ఈ ఆచారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమిర్పూర్‌ జిల్లా కుంద్రా గ్రామంలో ఉంది. 500 ఏళ్ల వారసత్వంగా వస్తోందీ సంప్రదాయం. చిన్నా, పెద్దా ఆడవాళ్లంతా రంగులు చల్లుకొని,  డప్పులు, నృత్యాలతో ఊరంతా సందడి చేస్తారు.  ఆ రోజు ఆడవాళ్లు ముసుగు సంప్రదాయానికి స్వస్తి చెబుతారు. తమ ఇష్ట దైవాన్ని పూజిస్తారు. ఆనవాయితీగా వస్తున్న పాటను పాడతారు. స్వేచ్ఛగా వీధుల్లో విహరిస్తారు.

ఆడవాళ్లు ముందుకొచ్చారు..

మహిళా సాధికారతకు నిదర్శనంగా హోలీ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు గ్రామస్థులు. చుట్టూ అడవి. బందిపోటు దొంగలు. భయం గుప్పెట్లో ఊరు ఉన్న రోజులవి. స్థానికులంతా హోలీ చేసుకోవడానికి యథావిధిగా రామాలయానికి చేరుకున్నారు... సంబురాలు జరుగుతున్న సమయంలో రాజ్‌పాల్‌ అనే వ్యక్తిని దొంగలు కాల్చి చంపారు. ఆ ఘటనతో చాలా ఏళ్లు వాళ్లు హోలీ చేసుకోలేదు. అప్పుడు మహిళలు ధైర్యం చేసి హోలీ నిర్వహించారట. వారి ధైర్య సాహసాలకు గుర్తుగా ఆడవాళ్లు మాత్రమే పండుగ చేసుకుంటున్నారు. వేడుక జరుగుతున్న సమయంలో మగవారంతా ఇంట్లోనే ఉంటారు. లేదా పొలం పనులకు వెళ్లిపోయి సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు. అక్కడ ఈ పండగని రెండు రోజులు నిర్వహిస్తారు. మొదటి రోజు అందరూ కలిసి చేసుకుంటారు. రెండో రోజు మహిళలకు మాత్రమే. కాదని ఏవరైనా వచ్చారో... దెబ్బలు పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్