అక్కడ ఇంజిన్‌లు మహిళలే చేస్తున్నారు

వ్యాపారం, వాణిజ్యంలో ఇప్పుడిప్పుడు అమ్మాయిలు నిలదొక్కుకుంటున్నా... మాన్యుఫాక్చరింగ్‌ విభాగాల్లో మహిళల సంఖ్య మాత్రం చాలా తక్కువ.

Updated : 11 Mar 2023 05:05 IST

మనదే హవా

వ్యాపారం, వాణిజ్యంలో ఇప్పుడిప్పుడు అమ్మాయిలు నిలదొక్కుకుంటున్నా... మాన్యుఫాక్చరింగ్‌ విభాగాల్లో మహిళల సంఖ్య మాత్రం చాలా తక్కువ. అలాంటి పురుషాధిక్య రంగంలో ఆడపిల్లలకు అపార అవకాశాలు కల్పిస్తూ, సాధికారత దిశగా అడుగులు వేయిస్తోంది భారీ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌. దీనికి హోసూరులో ఓ తయారీ కేంద్రం ఉంది. దీని ప్రత్యేకత ఏంటి అంటారా? ఇక్కడ ఉన్న 80 మంది మహిళా ఉద్యోగులే ఇంజిన్లు ఉత్పత్తి చేసేలా తీర్చిదిద్దింది యాజమాన్యం. ‘నాణ్యమైన ఉత్పత్తులను తీసుకురాగలిగే సమర్థత స్త్రీలకు ఉంది. తద్వారా వారి జీవితాలను మెరుగుపరుచుకోవడమే కాదు... వారి కుటుంబ స్థితిగతులన్నీ మార్చుకోగలరు. అందుకోసమే మహిళా ఉద్యోగులకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వడానికీ మేం సిద్ధంగా ఉన్నాం’ అంటారు ఆ సంస్థ సీఈవో షేనూ అగర్వాల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్