ఆ గీతల్లో.. ఈ గుర్తులు!

గర్భం దాల్చి నెలలు నిండుతున్నకొద్దీ మన శరీరంలో ఎన్నో మార్పులు. ప్రసవం తర్వాతా ఆ మాతృత్వపు ప్రయాణాన్ని గుర్తుచేస్తాయి స్ట్రెచ్‌మార్క్స్‌. కొంతమంది మాత్రం వాటి విషయంలో ఆత్మన్యూనతతో ఉంటారు. కానీ ఇది ప్రకృతి సహజం అని నిరూపిస్తూ తన చిత్రాల్లో మాతృత్వపు చారలకి ప్రాధాన్యం ఇస్తోంది పాకిస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల చిత్రకారిణి సారా ఎలైన్‌.

Updated : 15 Nov 2023 04:29 IST

ర్భం దాల్చి నెలలు నిండుతున్నకొద్దీ మన శరీరంలో ఎన్నో మార్పులు. ప్రసవం తర్వాతా ఆ మాతృత్వపు ప్రయాణాన్ని గుర్తుచేస్తాయి స్ట్రెచ్‌మార్క్స్‌. కొంతమంది మాత్రం వాటి విషయంలో ఆత్మన్యూనతతో ఉంటారు. కానీ ఇది ప్రకృతి సహజం అని నిరూపిస్తూ తన చిత్రాల్లో మాతృత్వపు చారలకి ప్రాధాన్యం ఇస్తోంది పాకిస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల చిత్రకారిణి సారా ఎలైన్‌.. ‘నాకు నెలలు నిండుతున్నకొద్దీ భుజాలు, పొట్ట, పిరుదులపై ఎక్కడ చూసినా మార్క్స్‌ కనిపించేవి. ప్రసవించిన తర్వాత కూడా అవి అలానే ఉండిపోవడం చూసి ఆత్మన్యూనతకు గురయ్యా. ఎన్ని క్రీంలు రాసినా అవి పోలేదు.

కొన్ని రోజులకి వాటిని అంగీకరించడం మొదలుపెట్టా. నాలాంటి వారందరికీ.. ఈ మార్క్స్‌ను చూసి బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని ప్రేమిద్దాం అని చెప్పడం కోసమే నా చిత్రలేఖనంలో వాటికి ప్రాధాన్యం ఇస్తున్నా’ అంటోంది సారా. కాన్వాస్‌పై అందమైన ల్యాండ్‌స్కేప్‌ చిత్రాలని గీసి వాటిపై తన స్ట్రెచ్‌ మార్క్స్‌నే ముద్రించి మాతృత్వపు అందాన్ని ప్రపంచానికి చాటుతోంది. వాటిని డిజిటల్‌ ప్రింట్లుగా మార్చి దుస్తులపై డిజైన్లుగా వేస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ సారా వేసే బొమ్మలకి లక్షలమంది అభిమానులున్నారు. వాళ్లంతా స్ట్రెచ్‌ మార్క్స్‌ ఇంత అందంగా ఉంటాయా అంటూ మురిసిపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్