90లో వ్యాపారవేత్తగా!

నాలుగు పదుల వయసుకే.. చిన్న పని చేయాలన్నా ఓపిక లేదు అనేస్తారు చాలామంది. అలాంటిది ఈ బామ్మగారు తొంభైలోకి అడుగుపెడుతూ కూడా అల్లికలతో అద్భుతాలు చేస్తున్నారు..  

Updated : 14 Dec 2023 02:31 IST

నాలుగు పదుల వయసుకే.. చిన్న పని చేయాలన్నా ఓపిక లేదు అనేస్తారు చాలామంది. అలాంటిది ఈ బామ్మగారు తొంభైలోకి అడుగుపెడుతూ కూడా అల్లికలతో అద్భుతాలు చేస్తున్నారు.. 

ఈ 89 ఏళ్ల బామ్మగారి పేరు పద్మా పారిక్‌. స్వస్థలం అహ్మదాబాద్‌. నాన్న ఆయుర్వేద వైద్యుడు. ఏడుగురు సంతానంలో పెద్దామె పద్మ. ‘ఆర్థిక పరిస్థితులు బాగోక.. ఏడో తరగతి వరకే చదివా. ఆపై కాలక్షేపం కోసం అల్లికలు నేర్చుకున్నా. మాకో అమ్మాయి. ఆమెకు ఇద్దరాడపిల్లలు. వాళ్లలో ఎవరి పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఇలా ఏ సందర్భం వచ్చినా నా చేత్తో అల్లిన క్రోషె పర్సులు, దుప్పట్లు బహుమతిగా ఇచ్చేదాన్ని. వాటిని చూసి పిల్లలు ముచ్చటపడేవాళ్లు’ అంటారు పద్మ. కొవిడ్‌ సమయంలో పద్మ మనవరాళ్లు తనతోనే ఉంటూ, ఆమెలోని కళని గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ అల్లిన ఒక పక్షిబొమ్మని వీడియో తీసి, సరదాగా పోస్ట్‌ చేశారు. అది చూసి చాలామంది బాగుందని మెచ్చుకోవడంతోపాటు ఆర్డర్లూ పెట్టడంతో బామ్మగారు వ్యాపారవేత్తగా మారారు. ఇంట్లోని పాత చీరలు, దుస్తుల వ్యర్థాలతో డోర్‌ మ్యాట్లు, దిండు కవర్లు వంటివి తయారుచేసి మనవరాళ్ల సాయంతో విక్రయిస్తున్నారు. ఆర్డర్లు వచ్చినా రాకపోయినా.. ఖాళీగా ఉండకుండా డిజైన్లతో ప్రయోగాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిస్తున్నారీమె. ప్రస్తుతం పద్మ తయారుచేసిన ఉత్పత్తులు అమెరికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్‌, జపాన్‌, కొరియా, చైనా వంటి చోట్లకు వెళ్తున్నాయి. ‘ఈ పని వల్ల నాకు మానసిక ఆనందం కూడా’ అంటారు పద్మా పారిక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్