పనిని ప్రేమించి... ప్రధాని ప్రశంసలు పొంది!

‘చేసే పని ఏదైనా... మనసుపెట్టి చేస్తే అందులో విజయం సాధించడం తేలిక. అందుకు ఉదాహరణ కోసం ఎక్కడో వెతకాల్సిన పనిలేదు. మన మధ్యే ఉంది. ఆమె పేరు లక్ష్మి’.

Published : 08 Feb 2024 05:34 IST

‘చేసే పని ఏదైనా... మనసుపెట్టి చేస్తే అందులో విజయం సాధించడం తేలిక. అందుకు ఉదాహరణ కోసం ఎక్కడో వెతకాల్సిన పనిలేదు. మన మధ్యే ఉంది. ఆమె పేరు లక్ష్మి’. అనే సామాన్య పారిశుద్ధ్య కార్మికురాలి గురించి ప్రధాని మోదీ అన్న మాటలివి. ఇంతకీ ఆమె గొప్పతనం ఏంటి?... ఇంటింటికీ తిరిగి, చెత్త ఏరే పనే. కానీ అందులోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది కంతి లక్ష్మి. తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో ఉన్న హస్నాబాద్‌ గ్రామం ఈమె స్వస్థలం. మూడేళ్ల క్రితం వరకూ ఈ పనిని ఆమె భర్త సైదప్ప చేసేవాడు. అతనికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ బాధ్యత లక్ష్మి తీసుకుంది. ఇంటి నుంచి చెత్త సేకరించేటప్పుడే తడి, పొడి చెత్తని వేరు చేసేలా గ్రామీణుల్లో అవగాహన తీసుకొచ్చింది. మొదట్లో ఎవరూ శ్రద్ధ పెట్టకపోయినా... ఓపిగ్గా వాళ్లకి నచ్చచెప్పింది. కొన్ని రోజులకి ఆ పనిలో విజయం సాధించింది. ఇలా ఆ ఊరివాళ్లు చెత్తని వేరుచేసి ఇవ్వడం వల్ల ఆ ఊరు బాగుపడింది. అదెలాగంటారా? పంచాయతీ సిబ్బంది పొడి చెత్త నుంచి ఇనుము, గాజు వంటి వాటిని వేరుచేసి అమ్మి ఆదాయం పొందుతున్నారు. లక్ష్మి... తడిచెత్తను కుళ్లబెట్టి సేంద్రియ ఎరువు తయారు చేసేది. దీని ద్వారానూ పంచాయతీ వాళ్లు ఆదాయం పొందుతున్నారు. వచ్చిన మొత్తాన్ని ఆ ఊరి అభివృద్ధికి ఉపయోగించేవారు. ఈ కృషే ఆమెకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి... ప్రధాని మోదీని కలిసే అవకాశం ఇచ్చింది. దిల్లీ నుంచి వచ్చిన లక్ష్మిని హస్నాబాద్‌ గ్రామస్థులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారిప్పుడు. 

అరిగె అనంత ప్రసాద్‌, కొడంగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్