వావ్‌... బార్బీ బిర్యానీ!

బిర్యానీ అంటే చికెన్‌, మటన్‌లతో కమ్మని వాసనతో నోరూరిస్తుంటుంది. కాస్త కలర్‌ఫుల్‌గా ఉండాలంటే కొందరు నారింజ లేదా పసుపు ఫుడ్‌కలర్‌ వాడుతుంటారు. కానీ పింక్‌ కలర్‌ ఎప్పుడైనా చూశారా... కాదు కాదు కనీసం విన్నారా? అవునండోయ్‌ ఇది నిజమే.

Updated : 21 Feb 2024 13:10 IST

బిర్యానీ అంటే చికెన్‌, మటన్‌లతో కమ్మని వాసనతో నోరూరిస్తుంటుంది. కాస్త కలర్‌ఫుల్‌గా ఉండాలంటే కొందరు నారింజ లేదా పసుపు ఫుడ్‌కలర్‌ వాడుతుంటారు. కానీ పింక్‌ కలర్‌ ఎప్పుడైనా చూశారా... కాదు కాదు కనీసం విన్నారా? అవునండోయ్‌ ఇది నిజమే. పింక్‌ బార్బీ బిర్యానీ అంటూ ఒక మహిళ ‘బార్బీ బిర్యానీ అచ్చీ లగ్‌ రహీ హై నా? పింక్‌ కలర్‌్ మసాలా, పింక్‌ కలర్‌ కే రైస్‌’  అంటూ ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా బార్బీ బిర్యానీ అనుకుంటున్నారా దానికో ప్రత్యేకత ఉంది. గత సంవత్సరం విడుదలైన బార్బీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది... గులాబీ రంగూ అందరి మనసులను దోచుకుంది. అది అప్పుడు బాగా ట్రెండైంది కూడా. దాన్ని మళ్లీ గుర్తుచేస్తూ... ఇటీవల ముంబయికి చెందిన హీనా కౌసర్‌ తన స్నేహితులతో కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేసింది. అందులో అంతా బార్బీ థీమ్‌ను ఎంపిక చేసుకుంది. అంతేకాదు, అందరూ ఎంతో ఇష్టంగా తినే బిర్యానీకి పింక్‌ ఫుడ్‌కలర్‌ వేసి తన మిత్రులకు ‘బార్బీ బిర్యానీ ఆస్వాదించండి అంటూ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అది చూసిన నెటిజన్లు ఆమె వంటపై స్పందిస్తూ లక్షల కొద్దీ లైక్‌లు పంపించారు. అలా ఆ  వీడియో వైరల్‌ అవ్వడంతో బిర్యానీ ప్రియులంతా ‘వావ్‌ బార్బీ బిర్యానీ’ అంటూ తామూ ట్రై చేయాలనుకుంటున్నారట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్