అక్కడ ఇళ్లన్నీ మహిళల పేరుమీదే..!

బాకాపుర్‌... మహారాష్ట్రలో రెండువేల గడపలున్న ఓ చిన్న గ్రామం. ఊరి పెద్దలు తీసుకొచ్చిన ఓ మార్పు ఎంతోమంది ప్రశంసలు అందుకుంటోంది.

Updated : 16 Mar 2024 15:35 IST

బాకాపుర్‌... మహారాష్ట్రలో రెండువేల గడపలున్న ఓ చిన్న గ్రామం. ఊరి పెద్దలు తీసుకొచ్చిన ఓ మార్పు ఎంతోమంది ప్రశంసలు అందుకుంటోంది. అదేంటంటారా...సాధారణంగా ఇల్లు మగవారి పేరు మీద ఉండటం చూస్తుంటాం... పుట్టింటివాళ్లు ఇస్తే తప్ప. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకం. ఈ ఊళ్లో ప్రతి ఇల్లూ, ఆ ఇంటి మహిళల పేరుమీదనే ఉంటుంది. ఒక్క ఇల్లు కూడా మగవారి పేరు మీద ఉండదట. అంతగా ఉండాల్సివస్తే, కో- ఓనర్‌గా మహిళ తప్పనిసరట. ఏ గడప దగ్గరకు వెళ్లినా, ఇంటిముందు నేమ్‌ప్లేట్‌పై యజమాని పేరు మహిళదే ఉంటుంది. అయితే వీళ్లు ఈ నిర్ణయం తీసుకోవడానికీ ఓ కారణముందట. వ్యసనాలకు బానిసైన కొందరు మగవాళ్లు ఇంటిని అమ్మేయాలని ప్రయత్నించడంతో ఇతర కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామపెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మహిళలకు ఇంటిపై హక్కు మాత్రమే కాకుండా, ఆర్థిక భద్రతా ఉంటుందని భావించారట. ఇప్పుడు బాకాపుర్‌లో ఎవరైనా ఇంటిని కొనాలన్నా, అమ్మాలన్నా అందుకు ఆ ఇంటి మహిళల అనుమతి తప్పనిసరి! లింగ సమానత్వాన్ని పాటించడంలో రెండడుగులు ముందే ఉన్న ఈ గ్రామం... దేశానికే స్ఫూర్తి అనడంలో అతిశయోక్తి లేదు కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్