అగోజీలు... అదరగొట్టేశారు!

18వ శతాబ్దం. ఒక్కో రాజ్యాన్నీ గెలుస్తూ... యూరోపియన్లు ప్రపంచ విజేతలమని గర్వపడుతున్న రోజులవి. కానీ ‘ఎంతలే!... చిటికెలో బానిసల్ని చేయొచ్చు’ అనుకున్న ఆఫ్రికాలోని డహోమీ రాజ్యం మాత్రం వాళ్లకి కొరుకుడు పడలేదు.

Updated : 16 Mar 2024 15:24 IST

18వ శతాబ్దం. ఒక్కో రాజ్యాన్నీ గెలుస్తూ... యూరోపియన్లు ప్రపంచ విజేతలమని గర్వపడుతున్న రోజులవి. కానీ ‘ఎంతలే!... చిటికెలో బానిసల్ని చేయొచ్చు’ అనుకున్న ఆఫ్రికాలోని డహోమీ రాజ్యం మాత్రం వాళ్లకి కొరుకుడు పడలేదు. పైపెచ్చు వాళ్లతో యుద్ధానికివెళ్లి బతుకుజీవుడా అని పారిపోయి వచ్చిన చేదు జ్ఞాపకం ఒకటి. దీనంతటికీ కారణం... ఆ రాజ్యానికున్న బలమైన మహిళా సైనిక పటాలం. దానిపేరు ‘అగోజీ’. 6000 మంది ఉండే ఈ ఆల్‌ విమెన్‌ వారియర్లు శత్రువులపై దండెత్తి, వాళ్ల తలలని తెచ్చి తమ రాజ్యంలో గెలుపు ట్రోఫీలుగా ప్రదర్శించేవారు. చరిత్రలోని వీరి కథని స్ఫూర్తిగా తీసుకుని నిర్మించిన సినిమానే ‘ది ఉమన్‌ కింగ్‌’. ఆస్కార్‌ గ్రహీత వయోలా డేవిస్‌ ‘జనరల్‌ ననిస్కా’గా నటించిన ఈ సినిమాలో.. దాదాపుగా స్త్రీ పాత్రలే కనిపిస్తాయి. వాళ్ల వీరోచిత పోరాటాలే తెరని ఆక్రమిస్తాయి. అయ్యో ఒక్క మగ పాత్రా లేదే అన్న వెలితి ఎక్కడా కనిపించదు. ఈ దశాబ్దంలోనే అతిగొప్ప మహిళా చిత్రంగా విమర్శకులు ప్రశంసించిన చిత్రం ఇది. వయోలా డేవిస్‌తో సహా అంతా నల్లజాతి మహిళలే నటించిన ఈ చిత్రంలో... బానిస జీవితాలనీ, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలనీ... అవి వాళ్ల జీవితాలపై చూపించే ప్రభావాన్నీ ప్రముఖంగా చూపించడం విశేషం. ఒక సైన్యాధ్యక్షురాలు... ఉమన్‌ కింగ్‌గా ఎదిగిన విధానాన్ని చూస్తే మనలోనూ ఆ పోరాట స్ఫూర్తి రగులుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్