సిక్కోలు... డ్రోన్‌ దీదీలు!

డ్రోన్‌ దీదీ... టెక్నాలజీ సాయంతో మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని సంకల్పించిన కార్యక్రమం.

Updated : 20 Mar 2024 03:14 IST

డ్రోన్‌ దీదీ... టెక్నాలజీ సాయంతో మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని సంకల్పించిన కార్యక్రమం. తాజాగా పదిమంది సిక్కోలు మహిళలు ఈ శిక్షణ అందిపుచ్చుకుంటే... వారిలో గాయత్రి మోదీ ఎదుట డ్రోన్‌ని నడిపి శెభాష్‌ అనిపించుకున్నారు... 

గ్రామీణ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 10 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. వారిలో పోలాకి మండలం సుసరాం గ్రామానికి చెందిన అరసవల్లి గాయత్రి దిల్లీలో మోదీ ఎదురుగా డ్రోన్‌ని నడిపారు.

గాయత్రి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. శిక్షణలో భాగంగా.. పది రోజులు చెన్త్నెలోని అన్నా యూనివర్సిటీలో, ఐదు రోజులు గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నైపుణ్యాలు అందుకున్నారు. ‘ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నేను ప్రధాని ముందు డ్రోన్‌ ఎగురవేయడం ఆనందంగా అనిపించింది. ఒక మనిషి ఎకరం భూమిని పిచికారీ చేయాలంటే 5గంటలు పడుతుంది. కానీ డ్రోన్‌తో 10 నిమిషాల్లో చేయొచ్చు. సమయం, డబ్బు, పురుగు మందునీ ఆదా చేయవచ్చు. దీనివల్ల రైతుకు ఎంతో ప్రయోజనం’ అంటున్నారు గాయత్రి.

 కోన శివ, శ్రీకాకుళం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్