పాత చెప్పులు దారి చూపించాయి!

సమస్య ఎక్కడుందో పరిష్కారమూ అక్కడే ఉందని నిరూపించారు ‘ఓషన్‌ సోల్‌’ మహిళా కార్యకర్తలు. ఆ సమస్య ఏంటో... వాళ్లు కనుక్కున్న పరిష్కారమేంటో తెలుసుకుందాం...

Published : 28 Mar 2024 01:54 IST

సమస్య ఎక్కడుందో పరిష్కారమూ అక్కడే ఉందని నిరూపించారు ‘ఓషన్‌ సోల్‌’ మహిళా కార్యకర్తలు. ఆ సమస్య ఏంటో... వాళ్లు కనుక్కున్న పరిష్కారమేంటో తెలుసుకుందాం...

ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు కలుషితం అవుతున్నాయన్నది తెలిసిందే. ముఖ్యంగా పర్యటకుల తాకిడి ఉండే చోట ఈ సమస్య మరీ ఎక్కువ. కెన్యా బీచ్‌లకూ పర్యటకులు వేసుకొనే ఫ్లిప్‌ఫ్లాప్‌ చెప్పులతో అటువంటి సమస్యే వచ్చింది. దానికి పరిష్కారంగా వారు కనిపెట్టిన కళాకృతుల తయారీ ఇప్పుడు వాళ్లకో జీవనోపాధిని చూపడం విశేషం. ఇదంతా ఎలా జరిగిందంటే.. జూలీ చర్చ్‌ పర్యావరణ ప్రేమికురాలు. బీచ్‌లు శుభ్రం చేసేవారామె. ఒకరోజు బీచ్‌లో కొట్టుకొచ్చిన చెప్పులతో అక్కడి పిల్లలు బొమ్మలు చేయడం గమనించారు జూలీ. ఆ బొమ్మలు ఆమెని ఎంతగా ఆకట్టుకున్నాయంటే... వాటి తయారీతో స్థానికులకు ఉపాధి కల్పించాలనుకున్నారు.

ఇందుకోసం ‘ఓషన్‌ సోల్‌’ అనే సామాజిక ప్రయోజనాలున్న వ్యాపారాన్ని ప్రారంభించారు. కొందరు మహిళలు ఫ్లిప్‌ఫ్లాప్‌ల సేకరించి తెస్తే... మరికొందరు వాటిని శుభ్రం చేసి వాటితో కళాఖండాలు తయారుచేస్తారు. అవి కూడా ఏదో ఒకటి కాదు అంతరించి పోతున్న సముద్ర జీవజాలం స్ఫూర్తితో వీటిని తయారుచేస్తున్నారు. టూరిస్టుల కోసం ప్రత్యేకంగా చిన్నబొమ్మలనీ, డోర్‌ స్టాపర్స్‌నీ తయారుచేస్తున్నారు. టూరిస్టులని ఆకర్షించేందుకు నిలువెత్తు బొమ్మలని ప్రధాన కూడళ్లలో ఉంచుతున్నారు. ఈ బొమ్మలపై ఆధారపడి వెయ్యి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్