జీవితానికో గీత!

పెళ్లై, కుటుంబ బాధ్యతలు మొదలయ్యాక... ఆ పనులతోనే సరిపోతుంది. ఇక కొత్తగా ఏం నేర్చుకుంటాం? మనలో చాలామంది అభిప్రాయం ఇదే. మోహన ప్రియ మాత్రం పెళ్లయ్యాకనే తన అభిరుచికి పదును పెట్టుకున్నారు. చిత్రలేఖనంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

Published : 29 Mar 2024 02:19 IST

పెళ్లై, కుటుంబ బాధ్యతలు మొదలయ్యాక... ఆ పనులతోనే సరిపోతుంది. ఇక కొత్తగా ఏం నేర్చుకుంటాం? మనలో చాలామంది అభిప్రాయం ఇదే. మోహన ప్రియ మాత్రం పెళ్లయ్యాకనే తన అభిరుచికి పదును పెట్టుకున్నారు. చిత్రలేఖనంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు...

మోహనప్రియ స్వస్థలం తిరుపతి. తండ్రి చంద్రాచారి కార్పెంటర్‌. తిరుపతిలో ఎంబీఏ పూర్తిచేసిన తరవాత, పెళ్లి చేసుకున్నారు. ఆ తరవాతే చిత్రలేఖనంలో ప్రవేశించి... ఆ కళకి మెరుగులు దిద్దుకున్నారు. ‘పెళ్లికి ముందు బొమ్మలు వేసినా... చాలా తక్కువ. మావారు పళని సివిల్‌ ఇంజినీర్‌. ఆయనకు బొమ్మలు వేయడం ఇష్టం. నేనేదో సరదాకి వేసిన బొమ్మలు చూసి నన్నూ ప్రోత్సహించారు. చిత్తూరులో మెలకువలు నేర్చుకున్నా. అభ్యాసంతో... ఆత్మవిశ్వాసం వచ్చింది. వాటర్‌ కలర్‌, పెన్సిల్‌, చార్‌కోల్‌, అక్రిలిక్‌, ఆయిల్‌, ఫ్యాబ్రిక్‌ పెయింట్‌ ఇలా అనేక మాధ్యమాల్లో ప్రయోగాలు చేశా. ఏ కళలో అయినా ప్రయోగాలు చేస్తేనే కదా మనకో గుర్తింపు దొరికేది. ఆర్ట్‌లో లైట్‌ అనేది కీలకమైన విషయం. అందుకే లైట్‌ షేడ్స్‌పై అనేక ప్రయోగాలు చేశాను. మా అమ్మాయి సమంతనే ఇందుకు సబ్జెక్ట్‌గా ఎంచుకుని వివిధ కోణాల్లోంచి బొమ్మలు గీస్తున్నా. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పుస్తకంలో స్వాతంత్య్ర సమరయోధుడు ‘చిత్తూరు దాసు’ చిత్రాన్ని గీయడం ఎంతో గర్వంగా ఉంద’నే మోహనప్రియ కృషికి దామెర్ల రామారావు అవార్డు సహా అనేక పురస్కారాలు వరించాయి. తీరిక చిక్కినప్పుడల్లా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పిల్లలకు చిత్రలేఖనంలో ఉచితంగా మెలకువలు నేర్పిస్తున్నారు. ‘ఇప్పటివరకూ తిరుపతిలో ఆర్ట్‌ గ్యాలరీ లేదు. భవిష్యత్తులో ఏర్పాటు చేయాలన్నదే నా కల’ అంటున్నారు మోహనప్రియ.

 పిల్లనగోయిన రాజు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్