ఛాంపియన్‌ బామ్మ!

కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సుకత ఉండాలే గానీ వయసుతో పనిలేదు అని నిరూపిస్తున్నారు రాజస్థాన్‌కి చెందిన పనా దేవి. తొమ్మిది పదుల వయసులో ఛాంపియన్‌గా నిలిచి మూడు గోల్డ్‌ మెడళ్లు సాధించారు. ఈమెది రాజస్థాన్‌లోని అంఖిసర్‌ గ్రామం. స్థానిక స్టేడియంలో పిల్లలు ఆటల్లో శిక్షణ పొందుతుండగా చూసిన బామ్మకు, వాటిపై ఇష్టం పెరిగింది.

Published : 25 Apr 2024 02:13 IST

కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సుకత ఉండాలే గానీ వయసుతో పనిలేదు అని నిరూపిస్తున్నారు రాజస్థాన్‌కి చెందిన పనా దేవి. తొమ్మిది పదుల వయసులో ఛాంపియన్‌గా నిలిచి మూడు గోల్డ్‌ మెడళ్లు సాధించారు.

మెది రాజస్థాన్‌లోని అంఖిసర్‌ గ్రామం. స్థానిక స్టేడియంలో పిల్లలు ఆటల్లో శిక్షణ పొందుతుండగా చూసిన బామ్మకు, వాటిపై ఇష్టం పెరిగింది. తన ఆసక్తిని గమనించిన మనవడు జైకిషన్‌ రన్నింగ్‌లో శిక్షణ ఇప్పించాడు. కోరుకున్న అవకాశం వచ్చేసరికి మరింత శ్రద్ధ చూపించి, అనతికాలంలోనే అందులో ప్రావీణ్యం సంపాదించారీ బామ్మ. ఒక్క ఆటతో ఆగిపోకూడదని షాట్‌ పుట్‌, డిస్కస్‌ త్రోల్లోనూ శిక్షణ పొందారు. కుటుంబ సహకారంతో పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలన్నింటిలోనూ పాల్గొంటూ, ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ మెడళ్లు గెలుచుకున్నారు. ఈ ఏడాది జరిగిన 44వ నేషనల్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగుపందెం, షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో మూడు గోల్డ్‌ మెడళ్లు సాధించింది. ఆమె విజయానికి మరో కారణం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కూడా. రోజుకు రెండు గంటలు ప్రాక్టీస్‌ చేస్తారు. ఆరోగ్యకరమైన డైట్‌నూ ఫాలో అవుతారు. ప్యాషన్‌, పట్టుదల ఉండాలే కానీ దేన్నైనా సాధించొచ్చు అంటోన్న పనాదేవి, ఆగస్టులో స్వీడన్‌లో జరగనున్న వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌నకు మనదేశం తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్