మనసున్న పోలీసు!

ప్రజల రక్షణ పోలీసుల బాధ్యత. అది దొంగతనాలు, దోపిడీల నివారణకే పరిమితం కాదు... సురక్షితంగా ఇంటికి చేరేలా చూడటమూ తన కర్తవ్యమే అనుకున్నారామె. ఆ విధిని నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలూ పొందుతున్నారు వర్ష బీవీ!

Published : 22 May 2024 01:40 IST

ప్రజల రక్షణ పోలీసుల బాధ్యత. అది దొంగతనాలు, దోపిడీల నివారణకే పరిమితం కాదు... సురక్షితంగా ఇంటికి చేరేలా చూడటమూ తన కర్తవ్యమే అనుకున్నారామె. ఆ విధిని నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలూ పొందుతున్నారు వర్ష బీవీ!

గుంతలతో నిండిన రోడ్లపై ప్రయాణం ఎంత నరకం? ఒళ్లు నొప్పులు, సకాలంలో గమ్యం చేరకపోవడం సంగతి పక్కన పెడితే ప్రమాదాలూ ఎక్కువే. వర్షాకాలంలో నీటితో నిండిన గుంతలు కొన్నిసార్లు ప్రాణానికీ ముప్పే. ఇదే గమనించారు వర్ష. ఈవిడ కర్ణాటకలోని మండ్య సెంట్రల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌. తమ స్టేషన్‌ పరిధిలో ప్రజలు ఇలా ఇబ్బందులు పడటం చూడలేకపోయారామె. సొంత ఖర్చుతో లారీతో మట్టి తెప్పించి, వాటిని దగ్గరుండి పూడ్చేస్తున్నారు. ‘నేను పబ్లిక్‌ సర్వెంట్‌ని. ప్రజలకు సేవ చేయడం నా విధి. అలాంటిది వారిలా గతుకుల రోడ్లలో ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోయా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటారామె. అది చూసి స్థానికులు ఆమెను మెచ్చుకోవడమే కాదు ‘పాట్‌హోల్‌ వారియర్‌’ అనీ పిలుస్తున్నారు. వర్ష మాత్రం ‘స్టేషన్‌ పరిధిలోని వాటికే పరిమితం కాను. మున్ముందు ఇతర ప్రాంతాలపైనా దృష్టిపెడతా’నంటున్నారు. మనసున్న పోలీసమ్మ కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్