శానిటరీ ప్యాడ్స్‌ని కనిపెట్టింది.. మగాళ్ల కోసమేనట!

శానిటరీ ప్యాడ్స్‌.. మహిళల జీవితంలో ఇదొక ముఖ్యమైన వస్తువు. ఇప్పుడంటే అందరికీ దీని మీద అవగాహన ఉంది. సాంకేతికతను ఉపయోగించుకుని క్లాత్‌ నుంచి మెనుస్ట్రువల్‌ కప్‌ వరకూ అభివృద్ధి చెందాం. అయితే ఈ ప్యాడ్స్‌ని ఎవరు, ఎందుకు కనిపెట్టారో తెలుసా? వీటిని మొట్టమొదట మగవాళ్ల కోసం రూపొందించారట.

Updated : 28 May 2024 17:46 IST

శానిటరీ ప్యాడ్స్‌.. మహిళల జీవితంలో ఇదొక ముఖ్యమైన వస్తువు. ఇప్పుడంటే అందరికీ దీని మీద అవగాహన ఉంది. సాంకేతికతను ఉపయోగించుకుని క్లాత్‌ నుంచి మెనుస్ట్రువల్‌ కప్‌ వరకూ అభివృద్ధి చెందాం. అయితే ఈ ప్యాడ్స్‌ని ఎవరు, ఎందుకు కనిపెట్టారో తెలుసా? వీటిని మొట్టమొదట మగవాళ్ల కోసం రూపొందించారట. ఆశ్చర్యంగా ఉంది కదూ! అదెలానో తెలుసుకుందామా?

పూర్వం స్త్రీలు రుతుక్రమ సమయంలో పత్తి, గొర్రెల ఉన్ని, కుందేలు రోమాలతో తయారు చేసిన ప్యాడ్‌లు వాడేవారట. ఆ తర్వాత పాత దుస్తులతో సొంతంగా ప్యాడ్స్‌ తయారు చేసుకునేవారట. అయినప్పటికీ సౌకర్యవంతంగా లేకపోవడంతో రుతుస్రావ సమయంలో ఎక్కువగా కూర్చోవడానికే మొగ్గుచూపేవారు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడ్డ సైనికులకి కట్టుకట్టేందుకు పత్తి కన్నా కలప గుజ్జు రక్తాన్ని బాగా పీల్చుకుంటుందని ఫ్రాన్స్‌ నర్సులు గమనించి దాంతో శానిటరీ న్యాప్కిన్లను తయారు చేశారట. అయితే ఆ యుద్ధ సమయంలో, పాతబట్టలు అందుబాటులో లేకపోవడంతో పీరియడ్స్‌ వచ్చిన నర్సులు ఈ కలప గుజ్జుతో చేసిన శానిటరీ న్యాప్‌కిన్లనే ప్యాడ్‌ల్లా ఉపయోగించుకున్నారట. సౌకర్యవంతంగా అనిపించడంతో అదే కొనసాగించారట. అయితే.. పీరియడ్స్‌ గురించి బహిరంగంగా మాట్లాడుకోవడానికే ఇష్టపడని ఆ రోజుల్లో కొటెక్స్‌ అనే పేపర్‌ ప్రొడక్ట్‌ కంపెనీ ఈ శానిటరీ ప్యాడ్స్‌ గురించి అడ్వర్టైజ్‌మెంట్లూ, క్యాంపెయిన్లూ చేసి మహిళలకు మరింత చేరువ చేసింది. ఆ తర్వాత చాలా కంపెనీలు ఈ శానిటరీ ప్యాడ్స్‌ని తయారుచేయడం మొదలుపెట్టాయి. టెక్నాలజీ పెరిగి ఆధునిక పద్ధతులు ఎన్ని వచ్చినా వాటికి మూలం మాత్రం ఫ్రాన్స్‌ నర్సుల ఆవిష్కరణే. ఏదేమైనా యుద్ధం మహిళల జీవితాల్లో మరో ప్రధాన మార్పునకు కారణమైంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్