రుచిని పెంచే మసాలా చిట్కా!

వంటకాలకు రుచి రావాలంటే...అందులో మసాలా పడాల్సిందే. అయితే దాన్ని అప్పటికప్పుడు నూరి వేయాలంటే బోలెడు సమయం, బయట కొని వాడాలంటే అంత బాగోదేమోనని సందేహం. అందుకోసమే ఈ చిట్కా...

Published : 06 Sep 2021 01:21 IST

వంటకాలకు రుచి రావాలంటే...అందులో మసాలా పడాల్సిందే. అయితే దాన్ని అప్పటికప్పుడు నూరి వేయాలంటే బోలెడు సమయం, బయట కొని వాడాలంటే అంత బాగోదేమోనని సందేహం. అందుకోసమే ఈ చిట్కా...

రెండు ఉల్లిపాయలు, నాలుగైదు టొమాటోలు, ఓ పెద్ద అల్లం ముక్క, 12-15 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి  ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె పోసి అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని వేసి పది నిమిషాలు చిన్న మంటపై వేయించాలి. ఉప్పు కలపొద్దు. ఈ మసాలాను ఏ కూరలోనైనా వాడుకోవచ్చు. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి దాదాపు పదిరోజుల వరకూ వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్