గులాబీ స్క్రబ్‌

చర్మం నిర్జీవంగా మారితే... ఒంటికి కాస్త నలుగు పెట్టాల్సిందే. అయితే ఈ బాడీషుగర్‌ స్క్రబ్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి.  అరకప్పు బ్రౌన్‌ షుగర్‌లో  కొబ్బరినూనె, రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ కలపాలి. చర్మం తాజాగా, తేమగా కనిపించడానికి ఈ స్క్రబ్‌ సాయపడుతుంది...

Updated : 06 Nov 2021 12:40 IST

చర్మం నిర్జీవంగా మారితే... ఒంటికి కాస్త నలుగు పెట్టాల్సిందే. అయితే ఈ బాడీషుగర్‌ స్క్రబ్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి.

రకప్పు బ్రౌన్‌ షుగర్‌లో  కొబ్బరినూనె, రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ కలపాలి. చర్మం తాజాగా, తేమగా కనిపించడానికి ఈ స్క్రబ్‌ సాయపడుతుంది.

కప్పు బ్రౌన్‌ షుగర్‌, పావుకప్పు కాఫీ పొడి, మూడు టేబుల్‌ స్పూన్ల బాదం నూనె కాస్త రోజ్‌ ఆయిల్‌ కలపండి. దీన్ని ఒంటికి రాసి రుద్దితే...చర్మం వన్నెలీనుతుంది.  

ఒక కప్పు హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌లో రెండు చెంచాల ఆలివ్‌నూనె, రెండు చుక్కల గులాబీ నూనె వేసి బాగా కలపండి. కాసిన్ని ఎండిన గులాబీరేకల్నీ అందులో వేసి ఒంటికి నలుగులా రాసి రుద్దితే చర్మం మృదువుగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్