అవసరానికే అప్పు...

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. వాటిని తమ చేతిమీదిగా ఉపయోగించే ఆర్థిక స్వాతంత్య్రమూ పెరిగింది. అంతవరకూ బాగానే ఉన్నా...పొదుపుపై దృష్టిపెట్టకపోతే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుంది. అందుకోసం ఏం చేయాలంటే....

Published : 08 Nov 2021 00:37 IST

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. వాటిని తమ చేతిమీదిగా ఉపయోగించే ఆర్థిక స్వాతంత్య్రమూ పెరిగింది. అంతవరకూ బాగానే ఉన్నా...పొదుపుపై దృష్టిపెట్టకపోతే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుంది. అందుకోసం ఏం చేయాలంటే....

* ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్లు... రాబడికి తగ్గట్లే ఖర్చు లెక్కలు వేసుకోవాలి. అంతకు మించి ఖర్చుపెట్టేస్తున్నారంటే...మీ బండి గాడి తప్పుతున్నట్లే. దానికి అడ్డుకట్ట వేయాలంటే...మీ ఖర్చులకో ప్రణాళిక ఉండాలి. సర్దుబాట్లు చేసుకోవాలి. అప్పుడే...ఒత్తిడికి లోనవకుండా ఉండగలరు.

* ఖర్చు చేసే ప్రతిరూపాయికీ లెక్క ఉండాలి. దాన్ని నెల తిరిగాక చూసుకుని అనవసరమైన ఖర్చులకు కోత వేయవచ్చు. అలా ఖర్చు తగ్గించుకోగలిగేవాటిలో బయట తినే ఆహారం, షాపింగ్‌, ప్రయాణాలు, ఫోన్‌-ఇంటర్నెట్‌ వాడకం వంటివన్నీ ఉంటాయి. కష్టమైనా తప్పదు. క్రమంగా అదే అలవాటు అవుతుంది.

* అప్పు అవసరానికే అనే విషయం మరిచిపోతుంటారు. పొదుపు చేయకపోగా చిన్న చిన్న ఖర్చుల్నీ అదుపు చేసుకోలేకపోతే...ఈ అలవాటు తలకు మించిన భారం కావొచ్చు. అలానే జీతంలో కనీసం పదిశాతం భవిష్యత్తు అవసరాల కోసం దాచగలిగితే...ఒడిదొడుకులకు లోనుకాకుండా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్