సీటీఎం.. కీర్తి రహస్యం
close
Updated : 10/11/2021 05:57 IST

సీటీఎం.. కీర్తి రహస్యం

క్కువ నీరు, ద్రవ పదర్థాలు తీసుకోవడమే తన మెరిసే చర్మ రహస్యమంటోంది కీర్తి సురేష్‌. ఇంకా.. ‘ఇంట్లో ఉన్నా.. షూటింగ్‌ అయినా.. సీటీఎం (క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌) తప్పక చేస్తా. సన్‌స్క్రీన్‌ లేకుండా కాలు బయట పెట్టను. శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే చర్మానికి సహజ కాంతి వస్తుందని నమ్ముతా. అందుకే రోజూ కొంత సమయం యోగాకి కేటాయిస్తా. సౌందర్య ఉత్పత్తులనూ సహజసిద్ధమైనవే వాడతా. రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. మేకప్‌ పెద్దగా నచ్చదు. బయటికి వెళ్లాలన్నా లైట్‌గా ఉండేలా చూసుకుంటా. ఫౌండేషన్‌ చర్మంపై ఉండిపోయి మెటిమలకు కారణమవుతుంది. అందుకే బీబీ క్రీమ్‌కి ప్రాధాన్యమిస్తా. రాత్రి పడుకునే ముందు మేకప్‌ తీసేయంది నిద్రపోను. తలకు తరచుగా కొబ్బరి నూనెతో మసాజ్‌ చేస్తా’ అని వివరిస్తోంది.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని