అందాల ఐష్‌... సౌందర్య రహస్యం!

వాతావరణం ఎలా ఉన్నా సమృద్ధిగా నీళ్లు తాగడమే తన మెరిసే మేనుకు కారణమని అంటోంది ఐశ్వర్యారాయ్‌. నీళ్లు బాగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉంటుంది.. అలాగే కాంతులీనుతుంది

Updated : 14 Nov 2021 04:36 IST

వాతావరణం ఎలా ఉన్నా సమృద్ధిగా నీళ్లు తాగడమే తన మెరిసే మేనుకు కారణమని అంటోంది ఐశ్వర్యారాయ్‌. నీళ్లు బాగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉంటుంది.. అలాగే కాంతులీనుతుంది అని చెబుతోంది. ప్రతిసారీ నీళ్లే తాగలేనివాళ్లు కొబ్బరినీళ్లు, పండ్లరసాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.

ధ్యానంతో... నటిగానే కాకుండా భార్యగా, తల్లిగా, కోడలిగా... పలు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇలాంటి సమయంలో కాస్త ఒత్తిడికి గురవడం మామూలే. దాన్ని తగ్గించుకోవడానికి ధ్యానాన్ని ఎంచుకున్నానంటోంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారి రోజంతా ఉల్లాసంగా ఉంటుందట.

హోమ్‌మేడ్‌ ఫేస్‌ ప్యాక్స్‌...  సెనగపిండి, పాలు, పసుపుతో తయారుచేసిన పూతలతో మోమును మెరిపించుకుంటోంది. దీంతోపాటు కీర రసం కూడా మోము మెరుపునకు కారణమంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్