పోషకాహారం.. రష్మిక రహస్యం
close
Published : 20/11/2021 00:39 IST

పోషకాహారం.. రష్మిక రహస్యం!

క్కువ నూనె, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తన అందం రహస్యమంటోంది రష్మిక మందన్నా. ఇంకా..‘నాకు టొమాటో, క్యాప్సికం, దోస వంటి కొన్ని కూరగాయలు పడవు. కాబట్టి.. ఏ ఉత్పత్తి వాడినా సరిపడుతుందో లేదో అని చెక్‌ చేసుకున్నాకే వాడతా. అందరికీ ముందు అలర్జీ టెస్ట్‌ చేశాకే వాడమని సలహా ఇస్తుంటా. ముఖాన్ని తరచూ కడగడం ఇష్టముండదు. ఎక్కువసార్లు చేస్తే పొడిబారుతుంది. కాబట్టి రోజు మొత్తంలో రెండుసార్లే శుభ్రం చేస్తా. మాయిశ్చరైజర్‌ చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. ముఖం, మెడ ప్రాంతాల్లో తప్పకుండా రాస్తా. శరీరానికిలాగే చర్మానికీ న్యూట్రియంట్లు అవసరం. అందుకే విటమిన్‌ సి సీరాన్ని రాస్తా. సన్‌స్క్రీన్‌ లోషన్‌ లేకుండా అడుగు బయటపెట్టను. ఏమాత్రం సమయం దొరికినా ముఖం, పెదాలను స్క్రబ్‌ చేస్తా. దీంతోపాటు నీటినీ ఎక్కువగా తీసుకుంటా. దాంతో మొటిమల సమస్య ఉండదు’ అని చెబుతోంది. ఏ ఉత్పత్తిని వాడినా చర్మతత్వానికి తగినదో కాదో చెక్‌ చేసుకోమని సలహా ఇస్తోంది. గమనించుకోండి మరి!


Advertisement

Tags :

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని