ఖర్చును కనిపెడుతుంది...

ప్రతినెలా జీతం ఎలా ఖర్చు అవుతోందో.. తెలియక తీవ్రంగా మదన పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లో ‘మింట్‌’ యాప్‌ ఉంటే చాలు. నెలనెలా మీ జమాఖర్చు లెక్కలు చూసే గుమాస్తాలాంటిదీ యాప్‌.

Updated : 30 Nov 2021 15:10 IST

ప్రతినెలా జీతం ఎలా ఖర్చు అవుతోందో.. తెలియక తీవ్రంగా మధనపడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లో ‘మింట్‌’ యాప్‌ ఉంటే చాలు. నెలనెలా మీ జమాఖర్చు లెక్కలు చూసే గుమాస్తాలాంటిదీ యాప్‌. నిత్యావసర వస్తువులు, గ్యాస్‌, ఇంటి అద్దె వంటి అవసరాలతో పాటు షాపింగ్‌ వరకు మీరు ఖర్చుపెట్టే ప్రతి పైసా సమాచారాన్నీ ఇది అందిస్తుంది. అవసరాలకు మించి అయ్యే వ్యయాన్ని తెలుసుకోవడానికి సాయపడుతుంది. దీంతో అనవసరపు వ్యయాన్ని దూరంగా ఉంచి, పొదుపు మార్గాలను అన్వేషించొచ్చు. అంతేకాదు... ప్రతి నెలా చెల్లించాల్సిన బిల్లులు, ఫీజులు, లోన్స్‌, క్రెడిట్‌కార్డు, ట్యాక్స్‌ వంటి వాటికి కట్టాల్సినవన్నీ ముందే గుర్తు చేస్తుంది. ఖాతాలో పడే నగదు వివరాలనూ అందిస్తుంది. ఆదాయం, వ్యయాన్ని బ్యాలెన్స్‌ చేసి ఆర్థికపరమైన సమస్యలకు చెక్‌ పెట్టడానికి ఈ బడ్జెట్‌ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్