ఇంట్లో సౌందర్య రహస్యం!

కాలుష్య ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు చర్మ సౌందర్యానికి మరింత శ్రద్ధ అవసరం అందుకే.. బయట దొరికే క్రీముల కన్నా ఇంట్లో ఉండే వాటితోనే చర్మానికి పోషణ ఇవ్వాలనుకుంటా అని అంటోంది అందాల తార నిధి అగర్వాల్‌. చిన్నప్పటి నుంచి అమ్మ కూడా అదే చెప్పేది. అందుకే అదే అనుసరిస్తా. పైగా వీటికి పెద్దగా ఖర్చూ కాదు.

Published : 15 Jan 2022 01:23 IST

కాలుష్య ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు చర్మ సౌందర్యానికి మరింత శ్రద్ధ అవసరం అందుకే.. బయట దొరికే క్రీముల కన్నా ఇంట్లో ఉండే వాటితోనే చర్మానికి పోషణ ఇవ్వాలనుకుంటా అని అంటోంది అందాల తార నిధి అగర్వాల్‌. చిన్నప్పటి నుంచి అమ్మ కూడా అదే చెప్పేది. అందుకే అదే అనుసరిస్తా. పైగా వీటికి పెద్దగా ఖర్చూ కాదు.

మురికి పోవాలంటే...
* టాన్‌ తొలగాలంటే టొమాటోని చక్రాల్లా కోసి దాంతో చేతులు, మోకాలు, కాలు, మెడ, ముఖం.. రుద్దండి. అలా చేస్తున్నప్పుడు కాస్త మండుతున్నట్లుగా అనిపిస్తుంది. అంటే దానర్థం అది పని చేస్తోందని.
* కాస్త పెరుగు, నిమ్మరసం, తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని మురికి బాగా ఉన్న చోట రాసుకోండి. నిమ్మరసం వల్ల కొద్దిగా చురుక్కుమనిపిస్తుంది. అయినా సరే! 30 నిమిషాలు ఉంచి కడిగేయండి. తేడా మీకే తెలుస్తుంది. ఈ లేపనం చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. వయసు ఛాయలు కనిపించనీయదు.

ఆహ్వానం
వసుంధర పేజీపై సలహాలు, సూచనలు, నిపుణులకు ప్రశ్నలు... మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌ చేయొచ్చు. ఇది కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది.
ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్