పీసీఓఎస్‌, అవాంఛిత రోమాలు.. పరిష్కారమేంటి?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 34 ఏళ్లు. నాకు పీసీఓఎస్‌ ఉంది. అవాంఛిత రోమాలు బాగా వస్తున్నాయి. దీనివల్ల నలుగురిలోకీ వెళ్లలేకపోతున్నా....

Published : 27 Jan 2023 20:57 IST

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 34 ఏళ్లు. నాకు పీసీఓఎస్‌ ఉంది. అవాంఛిత రోమాలు బాగా వస్తున్నాయి. దీనివల్ల నలుగురిలోకీ వెళ్లలేకపోతున్నా.. ఈ సమస్యకేదైనా పరిష్కార మార్గం చెప్పండి. - ఓ సోదరి

జ: పీసీఓఎస్‌ ఉన్న వారికి శరీరంలో ఆండ్రోజెన్‌ స్థాయులు ఎక్కువగా ఉండడం వల్ల అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. దీనికోసం రెండు రకాల చికిత్సలు అవసరమవుతాయి.

మొదటిది- అంతర్గతంగా ఉన్న హార్మోన్ల అసమతుల్యతకు చికిత్స చేయడం. దీనికోసం యాంటీ ఆండ్రోజెన్‌ ఉన్న కాంట్రాసెప్టివ్‌ పిల్స్ డాక్టర్ల సలహా మేరకు వాడాలి. మీరు బరువు ఎక్కువగా ఉంటే అది తగ్గడానికి ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామాలు చేయాలి.

రెండోది- కాస్మెటిక్‌ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏదైనా బ్యూటీ పార్లర్‌లో త్రెడింగ్‌ ద్వారా కానీ, వ్యాక్సింగ్‌ ద్వారా కానీ అవాంఛిత రోమాలు తొలగించడం లేదా శాశ్వత పరిష్కారం కావాలంటే లేజర్‌ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. అయితే మొదటి చికిత్స తీసుకోకుండా రెండోది సరిగ్గా పనిచేయదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్