తడి జుట్టుతో నిద్రపోతున్నారా?

రాత్రి పూట నిద్ర పోయే ముందు తలస్నానం చేస్తుంటారు కొందరు. జుట్టు తడిగా ఉండగానే నిద్రపోతుంటారు. అయితే దీనివల్ల సౌందర్యపరంగా పలు సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

Published : 02 Dec 2023 19:25 IST

రాత్రి పూట నిద్ర పోయే ముందు తలస్నానం చేస్తుంటారు కొందరు. జుట్టు తడిగా ఉండగానే నిద్రపోతుంటారు. అయితే దీనివల్ల సౌందర్యపరంగా పలు సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఇలా జరగక్కూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు.

⚛ వీలు కుదుర్చుకొని ఉదయాన్నే తలస్నానం చేయడం మంచిది. తద్వారా రాత్రి పడుకునే సమయానికి కేశాలు సహజసిద్ధంగా ఆరిపోతాయి. కాబట్టి హెయిర్‌ డ్రయర్స్‌ ఉపయోగించే అవసరం ఉండదు. తద్వారా జుట్టు డ్యామేజ్‌ కాకుండానూ కాపాడుకోవచ్చు.

⚛ తలస్నానం చేశాక కాటన్‌ టీ-షర్ట్‌ లేదంటే కాటన్‌ టవల్‌తో జుట్టును పొడిగా తుడుచుకోవాలి. కాటన్‌ వస్త్రం వెంట్రుకల్లోని తేమను సులభంగా పీల్చేసుకుంటుంది. తద్వారా జుట్టు త్వరగా ఆరిపోతుంది.

⚛ వెంట్రుకలు దృఢత్వాన్ని కోల్పోకూడదంటే తలస్నానం చేశాక కండిషనర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు.

⚛ ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పడుకునే ముందే తలస్నానం చేయాల్సి వస్తే సిల్క్‌ దిండు కవర్‌ను ఉపయోగించమంటున్నారు నిపుణులు. తద్వారా దిండుకు, వెంట్రుకలకు మధ్య రాపిడి తక్కువగా జరిగి జుట్టు డ్యామేజ్‌ కాకుండా కొంత వరకు రక్షించుకోవచ్చంటున్నారు.

⚛ రాత్రుళ్లు జుట్టు ఆరబెట్టుకునే సమయం లేని వారు తక్కువ వేడితో బ్లో-డ్రయర్స్‌ ఉపయోగించి వెంట్రుకల్ని ఆరబెట్టుకుంటే జుట్టు మరీ ఎక్కువగా డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

⚛ తడి జుట్టుకు కొబ్బరి నూనె రక్షణ కవచంలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అందుకే తప్పని పరిస్థితుల్లో తడి జుట్టుతోనే నిద్రపోవాలనుకునే వారు కొన్ని చుక్కల కొబ్బరి నూనెను జుట్టు చివర్లకు రాసుకుంటే సరి!

⚛ దిండు కవర్లను ఎప్పటికప్పుడు మార్చడం వల్ల కూడా వాటిపై చేరిన బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి కుదుళ్లను, ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్