కాళ్లు, చేతులు.. కోమలంగా!

వాతావరణం ఎలా ఉన్నా సరే.. కొందరి చేతులు, కాళ్లు పొడిబారి, పగిలి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు కారణమేదైనా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. వాటిని తిరిగి కోమలంగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు.

Published : 14 Sep 2023 19:49 IST

వాతావరణం ఎలా ఉన్నా సరే.. కొందరి చేతులు, కాళ్లు పొడిబారి, పగిలి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు కారణమేదైనా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. వాటిని తిరిగి కోమలంగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు.

కాళ్లు, చేతులపై మృతకణాలు పేరుకున్నప్పుడు కూడా చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే వాటిని తొలగించుకునేందుకు కొన్ని పూతలు తయారుచేసుకొని వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.

రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెను పాదాలకు రాసుకుని మర్దన చేయాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల పొడిబారిన చర్మం తిరిగి మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా వంటసోడా, ఏదైనా కొన్ని చుక్కల అత్యవసర నూనెను వేయాలి. కుదిరితే కొన్ని గులాబీ రేకలూ వేసుకోవచ్చు. ఇందులో చేతులు లేదా కాళ్లను ఓ పదినిమిషాలు ఉంచి తీసేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల చర్మం మృదువుగా మారుతుంది.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌ వేసుకుని అందులో చేతులు, కాళ్లను కాసేపు ఉంచాలి. పదినిమిషాల తర్వాత బయటికి తీసి కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ భాగాలకు రక్తప్రసరణ మెరుగై మెరుపును సంతరించుకుంటాయి.

సగం నిమ్మచెక్కను తీసుకుని చక్కెరలో ముంచి తీయాలి. దీన్ని కాళ్లు, చేతులకు రుద్దుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు ఆలివ్‌నూనెను రాసుకొని, మర్దన చేసుకున్నా సరిపోతుంది. ఇది చర్మాన్ని ఎంతో కోమలంగా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్