Pabiben Rabari: నీళ్లు తోడితే రూపాయి ఇచ్చేవారు

నాకు అయిదు, చెల్లికి మూడేళ్లున్నప్పుడు నాన్న చనిపోయారు. అప్పటికి అమ్మ మూడోసారి గర్భిణి. నాలుగోతరగతి వరకే చదువుకోగలిగా. నూతిలో నీళ్లు తోడిస్తే రూపాయిచ్చేవారు.

Updated : 28 Feb 2023 05:02 IST

నాకు అయిదు, చెల్లికి మూడేళ్లున్నప్పుడు నాన్న చనిపోయారు. అప్పటికి అమ్మ మూడోసారి గర్భిణి. నాలుగోతరగతి వరకే చదువుకోగలిగా. నూతిలో నీళ్లు తోడిస్తే రూపాయిచ్చేవారు. ఇంట్లో చెల్లెళ్లను చూసుకుంటూ, అమ్మకు తోడుగా ఇళ్లల్లో పనులకు వెళ్లేదాన్ని. ఆడపిల్లలకు ఎంబ్రాయిడరీ తెలిసుంటే వరుడు త్వరగా దొరుకుతాడనేవారు. దాంతో నానమ్మ నాకు కుట్లు, అల్లికలు నేర్పింది. ఈ కళ నా జీవితాన్నే మార్చేసింది. ఒక ఎన్జీవోలో రూ.1500 జీతానికి ఎంబ్రాయిడరీ చేసిచ్చి అమ్మకు ఆర్థికంగా తోడయ్యా. ఆ తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ రకాల్లో ఎంబ్రాయిడరీ ఉత్పత్తులను తయారు చేయడం సొంతంగా తెలుసుకున్నా. ఆపై ‘హరి జరి’ ప్రారంభించి రెడీమేడ్‌ డిజైన్స్‌ చేసి విక్రయించా. ఇందులో నాలాంటివారికి శిక్షణ ఇవ్వాలనుకుంటే సామాజిక నిబంధనలను మీరుతున్నావంటూ స్థానికులు వ్యతిరేకించారు. ఇంటి నుంచి మహిళలు బయటకొచ్చి వ్యాపారం చేయకూడదంటూ ఖండించారు. అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తే విమర్శించేవారు. అయినా నా లక్ష్యాన్ని వీడలేదు. మహిళా సాధికారతపై అవగాహన కల్పించాక మార్పు వచ్చింది. అలా వందల మంది మహిళలకు శిక్షణనిచ్చి ఉపాధినందించా. ఈ కళను ప్రపంచమంతా తెలిసేలా చేశా. లక్ష్యం మంచిదైనప్పుడు ధైర్యంగా ముందడుగు వేయగలగాలి. అప్పుడు మన నిర్ణయం సరైనదే అని తెలియజేస్తూ ఇతరులూ మనతో కలిసి నడుస్తారు. అదీ విజయమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్