బ్లాక్‌ టీ ఆరోగ్యానికి మేటి!

ఘాటైన రుచీ, వాసన కలిగి ఉండే బ్లాక్‌టీలో ప్రయోజనాలెన్నో. కామెల్లియా సినెసిస్‌ అనే మొక్క ఆకుల పొడిద్వారా దీన్ని తయారు చేస్తారు.

Published : 02 Feb 2023 00:04 IST

ఘాటైన రుచీ, వాసన కలిగి ఉండే బ్లాక్‌టీలో ప్రయోజనాలెన్నో. కామెల్లియా సినెసిస్‌ అనే మొక్క ఆకుల పొడిద్వారా దీన్ని తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీన్నే రెడ్‌టీగానూ పిలుస్తారు.

* మధుమేహం, గుండె జబ్బుల, పీసీఓడీ వంటి అన్నింటికీ మూల కారణం అధికబరువే. రోజూ ఓ కప్పు బ్లాక్‌ టీ తాగితే...ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే అంటున్నాయి అధ్యయనాలు. ఎందుకంటే బ్లాక్‌ టీ పేగుల్లోని బ్యాక్టీరియాను వృద్ది చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి ఆరోగ్యకరంగా బరువు తగ్గే వీలుంటుంది. బ్లాక్‌ టీలోని పాలీఫినాల్స్‌ మెటబాలిజం పెరగడానికి కారణమయ్యే బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. క్యాన్సర్‌ కణతులు పెరగకుండానూ నిరోధిస్తాయి. కొవ్వు, కెలొరీలు, సోడియం తక్కువగా ఉండటం వల్ల శరీరంలో అదనపు కెలొరీలూ పేరుకోవు.

* బ్లాక్‌ టీలో కేంప్‌ ఫెరాల్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్‌ని అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ని దూరం చేస్తాయి. కొత్త కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. అలానే టానిన్లు...పేగులకు సంబంధించిన సమస్యలను నియంత్రిస్తాయి.

* బ్లాక్‌టీలో ఫైటో న్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను వెలుపలకు పంపుతాయి. అలానే ట్రైగ్లిజరాయిడ్ల సంఖ్యనూ తగ్గిస్తాయి. మధుమేహం, రక్తపోటు నియంత్రణకు ఈ టీ చక్కగా పనిచేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగానూ ఉంటుంది. ఈ బ్లాక్‌ టీని రోజూ తాగడం వల్ల ఒత్తిడి అదుపులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్