బెల్లంతో ప్రయోజనాలెన్నో!

తీపి తినాలనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు చాలామంది. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

Published : 21 Apr 2024 16:11 IST

తీపి తినాలనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు చాలామంది. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

⚛ ఇందులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

⚛ బెల్లంలో ఉండే ఇనుము, ఫాస్ఫరస్ రక్తహీనత ఎదురుకాకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ధిచేసే గుణం దీనికి ఉంది.

⚛ గర్భిణులు బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, అలర్జీల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

⚛ చక్కెర బదులు బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా మధుమేహం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

⚛ రోజుకో చిన్న బెల్లం ముక్క తినే మహిళల్లో నెలసరి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

⚛ ఇందులో యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్యా ఉండదు.

⚛ బెల్లం తింటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

⚛ ఇది డీటాక్సిఫికేషన్‌ ఏజెంట్‌గా పనిచేసి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. బరువూ నియంత్రణలో ఉంటుంది.

⚛ నీరసంగా అనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని చూడండి. తక్షణ శక్తి వస్తుంది.

⚛ బెల్లంతో చిక్కీలు, స్వీట్లు, ఎనర్జీ బార్స్‌.. వంటివి తయారుచేసుకొని రోజూ తీసుకోవచ్చు. అలాగే పాలు, టీలలో చక్కెరకు బదులు బెల్లం వాడడం మంచిదంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్