సగ్గుబియ్యం.. పోషక మిళితం!

సగ్గుబియ్యంతో పాయసం, వడ.. ఇలా రకరకాల వంటకాలు తయారుచేయడం మనకు అలవాటు. ఇది రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ మిన్నే! ఇంతకీ వీటిలో ఉండే పోషకాలేంటో తెలుసుకుందామా..?

Published : 22 Nov 2023 20:37 IST

సగ్గుబియ్యంతో పాయసం, వడ.. ఇలా రకరకాల వంటకాలు తయారుచేయడం మనకు అలవాటు. ఇది రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ మిన్నే! ఇంతకీ వీటిలో ఉండే పోషకాలేంటో తెలుసుకుందామా..?

శాకాహారులకు శరీరానికి తగినన్ని మాంసకృత్తులు అందవు. ఇలాంటప్పుడు సగ్గుబియ్యాన్ని రోజూ ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా వాటిలోని మాంసకృత్తులు శక్తినివ్వడమే కాదు.. కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకూ సహాయపడతాయి.

సగ్గుబియ్యంలోని పిండిపదార్థాలు రోజంతటికి కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరుపైనా ప్రభావం చూపుతాయి. తద్వారా మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్‌ ‘కె’.. వంటివి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అధిక రక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునే వారు రోజూ సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు.

అలాగే ఇందులో లభించే ఫోలికామ్లం, విటమిన్‌ ‘బి’.. గర్భంలో ఎదిగే శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్