Health: అమ్మాయిల కోసమే ఈ ఆహారం!

కౌమారదశ నుంచే ఆడపిల్లలకు పోషకాల అవసరం కాస్త ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రక్తహీనత, నిస్సత్తువ, జుట్టు రాలడం...వంటి ఎన్నో సమస్యలు కనిపిస్తుంటాయి.

Published : 21 May 2023 01:22 IST

కౌమారదశ నుంచే ఆడపిల్లలకు పోషకాల అవసరం కాస్త ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రక్తహీనత, నిస్సత్తువ, జుట్టు రాలడం...వంటి ఎన్నో సమస్యలు కనిపిస్తుంటాయి. వాటికి చెక్‌ పెట్టాలంటే ఈ పోషకాలన్నీ మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

* ఇనుము: ఈ వయసులోనే రుతుచక్రం మొదలవుతుంది. నెలసరి వల్ల రక్తహీనత ఎదురుకాకుండా ఉండాలంటే.. ఐరన్‌ తప్పనిసరి. ఇది అధిక మొత్తంలో లభించే ఫిష్‌, లివర్‌, సజ్జలు, రాగులు, ఆకుకూరలు, సెనగలు, ఉలవలు, పల్లీలు, నువ్వులు, కాయగూరలు, పండ్లను తరచూ తీసుకోవాలి.

*క్యాల్షియం: తగినంత లభించకపోతే ఎముకలు బలహీనంగా మారతాయి. ముప్పై దాటాక కీళ్ల నొప్పులు బాధించొచ్చు. పాలు, పాల సంబంధిత పదార్థాలను తీసుకోవాలి. వీటితో పాటు తాజా ఆకుకూరలు, నువ్వులు, రాగులు, రాజ్మా, వేరుసెనగ పప్పు, పప్పుధాన్యాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. 

* మేలు చేసే కొవ్వులు: చాలామంది కొవ్వు పదార్థాల్ని హానికారకం అనుకుంటారు. కానీ వీటిల్లో శరీరానికి మేలు చేసే కొవ్వులూ ఉంటాయి. బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్న అమ్మాయిలో పీరియడ్స్‌ క్రమంగా రాకపోవడానికి కొవ్వుల లోపం కారణమైతే... స్థూలకాయుల్లో ఇవి ఎక్కువ అవడం మరో కారణం. కాబట్టి వీటిని తగిన మోతాదులో తీసుకోవాలి. ఈ కొవ్వులు సరిగ్గా ఉంటేనే తీసుకునే ఇతర ఏ, డీ, ఈ, కే విటమిన్లను శరీరం స్వీకరిస్తుంది. రోజులో కనీసం 35 నుంచి 40 మి.లీ. నూనె తీసుకోవచ్చు. వనస్పతి వంటివాటిల్లో శాచురేటెడ్‌ ఫ్యాట్లు ఉంటాయి. వీటికి బదులు వేరుసెనగ, బాదం, పిస్తా, వాల్‌నట్లు, నువ్వులు వంటివాటి నుంచి అందేలా చూసుకోవాలి. వీటినుంచి మైక్రోన్యూట్రియంట్స్‌ సైతం అందుతాయి. ఇవన్నీ సమతులంగా శరీరానికి అందితేనే జీవక్రియలు బాగుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్